గూడూరు టౌన్: రవాణా, విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. తీపనూరు సమీపంలో సోమవారం ఓ స్కూలు బస్సు కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మంగళవారం గూడూరులో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. అయితే కొన్ని ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు బయట గేట్లకు తాళాలు వేసి లోపల తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు.
ర్యాలీగా అన్ని పాఠశాలలకు వెళ్లి మూయించేశారు. అనంతరం డిప్యూటీ డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిబంధనలను పాటించని ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు మనోజ్, రిషి, సాయి(ఏబీవీపీ), సునీల్( ఏఐఎస్‌ఎఫ్), పనబాక జగదీష్(వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం), వెంకటేష్, హరీష్(టీఎన్‌ఎస్‌ఎఫ్), ఉదయ్(బీఎన్‌ఎస్‌ఎఫ్), శ్రీనాథ్(ఎన్‌డీఎస్‌ఎఫ్), వెంకట్(పీఎస్‌డీఎఫ్) పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు మృతి
Published Wed, Dec 24 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement