నగదు రహితంపై చైతన్యం
నగదు రహితంపై చైతన్యం
Published Tue, Dec 6 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
నగరంలో భారీ ర్యాలీలు
కర్నూలు సిటీ: నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగహన కల్పించేందుకు మంగళవారం ఆర్‌యూ అనుబంధ డిగ్రీ కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, ఎన్‌సీసీ విభాగాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. నగదు లావాదేవీలను పోత్సహిద్దాం...అవినీతిని అరికడదామని నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ చేశారు. ఆయా కాలేజీల నుంచి బయలుదేరిన విద్యార్థులు కలెక్టర్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో జేసీ హరికిరణ్, ఆర్‌యూ వీసీ వై.నరసింహూలు, రిజిస్ట్రార్ బి.అమర్‌నాథ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, ఇందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను తెరవాలన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని, ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. దీనిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, చూట్టు పక్కల వారికి అవగహన కల్పించాలని కోరారు.
– స్థానిక రామచంద్రనగర్‌లోని శ్రీసాయి క్రిష్ణ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, శ్రీసాయి క్రిష్ణ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఏస్పీ ఆకే రవికృష్ణ ప్రారాంభించారు. ఈ సందర్భంగా ఏస్పీ మాట్లాడుతూ అవినీతి నిర్మూన భారత దేశాన్ని నిర్మించాలంటే ప్రతి ఒక్కరు నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం కర్నూలు డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. ఈ ర్యాలీలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రోషిరెడ్డి, అకడామిక్ అడ్వజర్ గోవర్ధన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, 3వ పట్టణ సీఐ మధుసూదన్‌రావులు ల్గొన్నారు.
– కేవిఆర్ మహిళ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులు ఆ కాలేజీకి చెందిన ప్రిన్సిపాల్ డా.రాజేశ్వరి ఆధ్వర్యంలో కాలేజీ దగ్గర నుంచి ఆర్‌ఎస్ రోడ్డు, రాజ్‌విహార్ మీదుగా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
– బిక్యాంపులోని సిల్వర్‌జూబ్లీ కాలేజి చెందిన విద్యార్థులు ర్యాలీగా అవినీతి రహిత భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని నినాదాలు చేసుకుంటు ర్యాలీ నిర్వహించారు.
– ఉస్మానియా కాలేజీకి చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు నగదు రహిత లావాదేవీలపై ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఆ కాలేజీ ఎన్‌సీసీ అధికారి మండి హూసేన్, ప్రిన్సిపాల్ డా.సిలార్ మహమ్మద్ పాల్గొన్నారు.
– రాయల సీమ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇందులో ఆర్‌యూ వీసీ, రిజిస్ట్రార్, విద్యార్థులు పాల్గొన్నారు.
– ఎస్టీబీసీ కాలేజీకి చెందిన విద్యార్థులు ఆర్‌ఎస్ రోడ్డు, రాజ్‌విహార్, మెడికల్ కాలేజీ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
Advertisement