ఉపాధ్యాయులతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
జిన్నారం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని గుమ్మడిదల గ్రామంలో మండల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవం ఉందన్నారు. చిన్ననాటి నుంచి చిన్నారులకు విద్యాబుద్దులు చెప్పి వారిని ప్రయోజకులను చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులే నన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిరుపేద విద్యార్థులకు విద్యను అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురభి నాగేందర్‌గౌడ్, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, మండల సంఘం అధ్యక్షులు ప్రభుకుమార్, నాయకులు వెంకటేశంగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, లతో పాటు ఉపాధాయ సంఘం నాయకులు స్వేచ్చారెడ్డి, కరుణాసాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.