best teachers
-
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
-
60 మంది ’ఉత్తమ గురువులు’
♦ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు ప్రదానం ♦ రూ.10 వేల నగదు, మెమెంటో, సత్కారం ♦ 37 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు ♦ రూ.10 వేల చొప్పున నగదు బహుమతి సాక్షి, హైదరాబాద్: వివిధ విభాగాల్లో 60 మందిని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠశాల విద్యలో 23 మంది, ఇంటర్ విద్యలో ముగ్గురు, డి గ్రీ కాలేజీలు, వర్సిటీల్లో 29 మంది, లాంగ్వేజ్ అండ్ కల్చర్ విభాగంలో 5 మంది అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శుక్రవారం ఉత్తమ గురువు అవార్డులు అందుకుంటారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతి, మెమెంటో అందజేసి శాలువాతో సత్కరిస్తారు. అలాగే 37 స్వచ్ఛ విద్యాలయాలకు కూడా పురస్కారాలు ప్రకటించారు. ఒక్కో విద్యాలయానికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఈ అవార్డులను ఈ నెల 5వ తేదీనే ఇవ్వాల్సి ఉన్నా నిమజ్జనం వల్ల కుదరలేదు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నా ఆయన కంటికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో రాలేకపోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది. మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పాల్గొంటారు. గతానికి భిన్నంగా ఎంపిక టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు గతంలో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఎంపికైన వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసేవారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని వారిని కూడా ఎంపిక చేశారు! పలు జిల్లాల్లో సెలవులు పెట్టకుండా, అంకిత భావంతో పని చేసే టీచర్లను గుర్తించి మరీ అవార్డులకు ఎంపిక చేశారు. హెల్త్ వర్సిటీ, వెటర్నరీ, అగ్రి వర్సిటీల పరిధిలోని లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లకు కూడా అవార్డులిచ్చారు. అయితే 57 ప్రభుత్వ కాలేజీలున్న పాలిటెక్నిక్‌లలో ఒక్కరికీ అవార్డు రాలేదు. 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే వాటినుంచి ముగ్గురే ఎంపికయ్యారు. 126 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నుంచి ఇద్దరికి, 25 వేల ప్రభుత్వ పాఠశాలల నుంచి 23 మంది టీచర్లకు అవార్డులు లభించాయి. గతేడాది మొత్తం 70 మందికి అవార్డులిచ్చారు. విద్యా శాఖ/ఎన్టీఎఫ్డబ్ల్యూ/స్పెషల్ కేటగిరీ కింద రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారు... పాఠశాల విద్యలో... స్పెషల్ కేటగిరీలో.. ఇంటర్మీడియట్ విద్యలో.. కళాశాల విద్యలో డిగ్రీ లెక్చరర్లు/యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. అనుబంధ కాలేజీల్లో... లాంగ్వేజ్ అండ్ కల్చర్‌లో... (నోటు: ఎస్ఏ-స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ-సెకండరీ గ్రేడ్ టీచర్, జీహెచ్ఎస్-గెజిటెడ్ హెడ్మాస్టర్, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం లో ఫిమేల్ లిటరసీ హెడ్మాస్టర్, హెచ్ఎం-హెడ్మాస్టర్, జేఎల్-జూనియర్ లెక్చరర్, జీజేసీ-గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఓయూ-ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ-కాకతీయ యూనివర్సిటీ, ఎస్‌యూ-శాతవాహన యూనివర్సిటీ, జీడీసీ-గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ) -
సేవలతో మెరి‘షి’
సావిత్రీ బాయి ఫూలే అవార్డు అందుకున్న ఉపాధ్యాయినులు తొలిమహిళా ఉపాధ్యాయినిగా, మహిళా పాఠశాలను స్థాపించి ఎందరో మహిళా విద్యావేత్తలను సమాజానికి అందించిన ఆదర్శ ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆదర్శ సతీమణి. ఆమెను ఆదర్శంగా తీసుకున్న జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులు అభాగ్యులకు ఆసరాగా.. బడి బయట పిల్లలకు దిక్సూచిలా.. విధి వంచించిన అబలలకు మార్గదర్శిలా నిలిచి అరుదైన పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సావిత్రీబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. వారే తళ్లా ఉమారాజ మంగతాయారు, బచ్చు ఉమాశ్రీదేవి. – భానుగుడి(కాకినాడ) తళ్లా..సేవలు భళా స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న తళ్లా ఉమారాజ మంగతాయారు 28 ఏళ్లుగా జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. బాల కార్మిక నిర్మూలన, మహిళా సాధికారికత, బాలికా విద్య, బాల్యవివాహాల నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కాకినాడ జనశిక్షణ సంస్థ ద్వారా వంద మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ నిచ్చి ఉపాధి చూపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు, నిరక్షరాస్యత నిర్మూలనకు అక్షర గోదావరి, అక్షర భారతి, అక్షర సంక్రాతి వంటి కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు. కమ్యూనిటీ మొబలైజేష¯ŒS ద్వారా పాఠశాలల నిర్మాణం, సమాజంలో మహిళలు, బాలికల వివక్ష పట్ల గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తున్నారు. సత్కారాలెన్నో..! 2008లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా, లయ¯Œ్స క్లబ్, రోటరీ క్లబ్, రాజమండ్రి కళాక్షేత్రంS ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయినిగా చేబ్రోలు, వీరవరం, గొల్లప్రోలు, తాటిపర్తి తదితర పాఠశాలల్లో పనిచేసి ఉత్తమ బోధనతో పాటు, విద్యాభివృద్ధిలో ఆమె చేసిన ప్రగతికిగాను సావిత్రీబాయి ఫూలే అవార్డును అందుకున్నారు. సేవల సిరి.. ఉమాశ్రీ సావిత్రీబాయి çఫూలే ఆదర్శంగా 23 ఏళ్ల పాటు ఎస్జీటీగా జిల్లాలో సేవలందిస్తున్న బచ్చు ఉమాశ్రీదేవి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరంలో ఉద్యోగవృత్తిని ప్రారంభించారు. బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఈమె ఎస్జీటీ కేడర్‌లో అవార్డును అందుకున్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు, కొవ్వూరు, కాజులూరు మండలం ఐతిపూడి, పెదపూడి మండలం లక్షీ్మనరసాపురంలలో పనిచేశారు. 23 ఏళ్లుగా రామకృష్ణ మఠంలో శాశ్వత సభ్యురాలిగా పలు సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే కోకనాడ అన్నదాన సమాజంలో మేజర్డోనర్గా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. అలయ¯Œ్స క్లబ్ జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తూ, ఓలే్డజ్ హోమ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. 2013 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, 2015 పడాల ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2016 రాజమండ్రి ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆ««దl్వర్యంలో బెస్ట్ టీచర్‌గా, ఫియలాజికల్ వర్సిటీ హైదరాబాద్ వారిచే ఇంటర్నేషనల్ లైఫ్ ఎచీవ్మెంట్, మధర్ థెరిస్సా ఫౌండేష¯ŒSచే ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డులను అందుకున్నారు. -
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
జిన్నారం: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని గుమ్మడిదల గ్రామంలో మండల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవం ఉందన్నారు. చిన్ననాటి నుంచి చిన్నారులకు విద్యాబుద్దులు చెప్పి వారిని ప్రయోజకులను చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది ఉపాధ్యాయులే నన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా నిరుపేద విద్యార్థులకు విద్యను అందించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురభి నాగేందర్‌గౌడ్, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ నరేందర్‌రెడ్డి, మండల సంఘం అధ్యక్షులు ప్రభుకుమార్, నాయకులు వెంకటేశంగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, లతో పాటు ఉపాధాయ సంఘం నాయకులు స్వేచ్చారెడ్డి, కరుణాసాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు
విద్యారంగానికి పెద్దపీట ఉపాధ్యాయులదే గురుతరమైన బాధ్యత జిల్లాను రోల్‌మోడల్‌గా తయారు చేద్దాం మహనీయుల కలలను నిజచేద్దాం మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.120 కోట్లతో ప్రణాళిక రూపొందించామని, త్వరలో నిధులు విడుదల చేసి అమలుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కరీంనగర్ టీఎన్జీవో ఫంక్షన్హాల్లో గురువారం జరిగింది. వివిధ కేటగిరీలకు చెందిన 90 మంది ఉపాధ్యాయులకు మెమెంటోలు, శాలువాలతో జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యాలయాలను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజల బాగోగులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎన్టీపీసీ వంటి సంస్థల సహకారంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, భవన నిర్మాణాలు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో మౌలికవసతుల కోసం జిల్లా ప్రజాప్రతినిధులు రూ.40 కోట్లు, మంత్రి కడియం శ్రీహరి రూ.80 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, అవి త్వరలోనే నిధులు రానున్నాయని అన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, మౌలిక వసతులను మెరుగుపరుస్తూ నాణ్యమైన విద్య అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ §lష్టిసారించారని స్పష్టంచేశారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపి నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో రోల్ మోడల్‌గా తయారుచేస్తామని, ఇందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సూచించారు. సావిత్రిబాయి పూలే, బీఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యత వైపు ముందుకు సాగాలని కోరారు. – జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. వీర్నపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అందరూ MSషి చేయాలన్నారు. – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజంలో ఉన్న చెడును పారదోలుతూ విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రై వేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేయాలని సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలలో ఉండేలా MSషి చేయాలని కోరారు. – ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే గురుతరమైన బాధ్యత అని అన్నారు. సమాజ మార్పు కోసం, వ్యవస్థ బాగు కోసం పరితపించే ఉపాధ్యాయులు ప్రై వేట్ విద్య జడలు విప్పడంపై దృlష్టిపెట్టాలని కోరారు. – కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యాబోధన చేసి పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు. నగర మేయర్ రవీందర్‌సింగ్, డీఈవో శ్రీనివాసాచారి, ఏజేసీ నాగేంద్ర, డెప్యూటీ ఈవోలు వెంకటేశ్వర్లు, ఆనందం, ýSష్ణమూర్తి, కిశోర్‌కుమార్, కె.శంకర్, మండల విద్యాధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, జాలి మహేందర్‌రెడ్డి, కటుకం రమేశ్, కె.సారయ్య, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, చొల్లేటి శ్రీనివాస్, కోహెడ చంద్రమౌళి, మీసాల మల్లిక్, రవినాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విలువలు పాటించిన వారినే ఎంపిక చేయాలి
ఆత్మకూరు(ఎం) : వత్తి ధర్మంలో విలువలు పాటించిన వారినే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలని మాతసేవా సంస్థ అధ్యక్షుడు కందారపు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి గజరాజు కాశీనాథ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అంతేగాని ఉపాధ్యాయ వత్తిని చేపట్టి ఇటు విద్యాబోధన అటు పైరవీలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం నడుపుతూ సరిగ్గా బడికి రాని వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయవద్దని ఉన్నతాధికారులకు విన్నవించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సభ్యులు యాస గోవర్ధన్ రెడ్డి, కల్వల నరేష్, రంగ మల్లేశం, నికిల్, రాజు ఉన్నారు. -
సర్కారు స్కూళ్ల పటిష్టతకు కృషి
– కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – సమస్యలుంటే వాట్సప్‌లో తెలియజేయాలని హెచ్ఎంలకు సూచన – 79 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సర్కారు స్కూళ్లను పటిష్టం చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ప్రధానోపాధ్యాయులంతా గ్రూపుగా ఏర్పడి స్కూళ్లలో నెలకొన్న సమస్యలను వాట్సప్ ద్వారా తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఒక్క రోజులోనే ప్రధానోపాధ్యాయుల గ్రూపును ఏర్పాటు చేయాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు వృద్ధిచేసుకుని పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 79 మందిని ఘనంగా సత్కరించారు. ఇందులో పాఠశాల విద్యలో 62 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విభాగంలో 17 మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్, ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రభుత్వ విభాగంలోని ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్, ఐఐఐటీ తదితర సంస్థల ప్రవేశాలకు విపరీతమైన పోటీ నెలకొందన్నారు. అయితే అదే ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు లేక అల్లాడిపోతున్నాయన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందోనని ఆలోచన చేయాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. టీచర్స్ హోం ఏర్పాటుకు కృషి :టీజీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం స్థలం చూపితే టీచర్స్ హోంను రాజ్యసభ నిధుల నుంచి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. వచ్చే ఉపాధ్యాయ దినోత్సవాన్ని అందులోనే నిర్వహించవచ్చన్నారు. అలాగే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి నమూనాలో ఓ కన్వెన్షన్ హాల్ నిర్మించేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యాయులు తమపై వచ్చిన మచ్చను పొగుట్టుకొనుటకు తీవ్రంగా కషి చేయాల్సి ఉందని టీజీ సూచించారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 2వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ జిల్లాలోని ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధన చేస్తున్నారని, వారి కషితోనే పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, జిల్లాలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్ని పాఠశాలల్లో బోధనకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి భర్తీకి చర్యలు తీసుకుంటే మరింతగా పనిచేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ గేయానంద్ తెలిపారు. తనకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు సాయంగా పోరాటానికి రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు, పి.మౌలాలి, ఏడీ అనురాధ, డిప్యూటీ డీవీఈఓ వెంకటరావు, డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులు 70 మంది
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను డీఈవో లింగయ్య బుధవారం ప్రకటించారు. వీరికి గురువారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు. ‘ఉత్తములు’ వీరే.. పేరు హోదా పాఠశాల మండలం రమేశ్ ఎస్ఏ, సైన్స్ రాంమందిరం ఆర్మూర్ నర్సయ్య పీజీ హెచ్ఎం కోమన్‌పల్లి ఆర్మూర్ విజయకుమారి ఎస్ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్ ప్రవీణ్‌కుమార్ ఎస్ఏ, ఇంగ్లిష్ ఆలూరు ఆర్మూర్ పి.నవీన్ ఎస్ఏ, గణితం మిర్ధాపల్లి ఆర్మూర్ ఆనంద్‌కుమార్ ఎస్ఏ, గణితం ఆలూరు ఆర్మూర్ అబ్దుల్‌అలీ ఎస్ఎ బయోసైన్స్ ఆలూరు ఆర్మూర్ శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఏ పీ.సైన్స్ ఆలూరు ఆర్మూర్ ఎల్.పద్మ ఎస్ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్ నరేందర్ పీజీ హెచ్ఎం మచ్చర్ల ఆర్మూర్ రాజేంద్రప్రసాద్ పీజీ హెచ్ఎం చేపూర్ ఆర్మూర్ సంపత్‌కుమార్ పీజీ హెచ్ఎం మిర్ధాపల్లి ఆర్మూర్ జె.లింగం పీజీ హెచ్ఎం ఆలూరు ఆర్మూర్ రఘునాథ్ ఎస్ఏ, పీ.సైన్స్ సుర్బియ్యాల్ ఆర్మూర్ గణేష్ పీజీ హెచ్ఎం పిప్రి ఆర్మూర్ సాయన్న పీజీ హెచ్ఎం సావెల్ బాల్కొండ అంజద్‌ఖాన్ ఎస్ఏ, హిందీ ముప్కాల్ బాల్కొండ డి.రేణుక ఎస్ఏ, తెలుగు ముప్కాల్ బాల్కొండ డి.శ్రీనివాస్ పీజీ హెచ్ఎం ముప్కాల్ బాల్కొండ లక్ష్మణ్ పీజీ హెచ్ఎం వన్నెల్(బి) బాల్కొండ ఇందిర పీజీ హెచ్ఎం గొనుగొప్పుల భీంగల్ మహేందర్ ఎస్ఏ బి.సైన్స్ మెండోరా భీంగల్ డి.సుజాత పీజీ హెచ్ఎం మెండోరా భీంగల్ వి.రమేశ్ ఎస్ఏ, తెలుగు తలమడ్ల భిక్కనూరు పి.శ్రీనాథ్ పీజీ హెచ్ఎం భిక్కనూరు భిక్కనూరు గగన్‌కుమార్ ఎస్ఏ, పి.సైన్స్ మిర్జాపూర్ బీర్కూరు పి.రవి ఎస్ఏ, తెలుగు అమ్దాపూర్ బోధన్ నాగయ్య పీజీ హెచ్ఎం ఎరాజ్‌పల్లి బోధన్ జ్ఞానేశ్వర్ ఎస్ఏ, గణితం దుబ్బాక ధర్పల్లి రాంచంద్ర పీజీ హెచ్ఎం ముత్యంపేట్ దోమకొండ శ్రీనివాసులు ఎస్ఏ, పి.సైన్స్ మహ్మద్‌పుర్ దోమకొండ పి.శ్రీనివాస్ ఎస్ఏ, సోషల్ మహ్మద్‌పుర్ దోమకొండ నారాయణగౌడ్ పీజీ హెచ్ఎం మహ్మద్‌పుర్ దోమకొండ వాయిద్పాషా ఎస్ఏ, పీ.సైన్స్ దోమకొండ దోమకొండ ఎ.గంగాధర్ పీజీ హెచ్ఎం పడకల్ జక్రాన్‌పల్లి జి.సదాశివ్ ఎస్ఏ, బి.సైన్స్ జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి బస్వంత్‌రావు ఎస్ఏ, సోషల్ జుక్కల్ జుక్కల్ ఎస్.దానయ్య పీడీ కౌలాస్ జుక్కల్ హీరా పీజీ హెచ్ఎం కౌలాస్ జుక్కల్ ఆనందరావు పీజీ హెచ్ఎం దేవన్‌పల్లి కామారెడ్డి భగత్ ఎస్ఏ, బి.సైన్స్ లింగాపూర్ కామారెడ్డి కె.బన్సీలాల్ ఎస్ఏ, తెలుగు బషీరాబాద్ కమ్మర్పల్లి కె.ప్రభాకర్ ఎస్ఏ, సోషల్ కోనసముందర్ కమ్మర్పల్లి మోహన్ ఎస్ఏ, పి.సైన్స్ కోటగిరి కోటగిరి ఎన్.శ్రీనివాసరావు పీజీ హెచ్ఎం కోటగిరి కోటగిరి ఎం.డి.అతీకుల్లా పీఈటీ గుత్ప మాక్లూర్ విద్యాకర్ ఎస్ఏ, సోషల్ ఎర్గట్ల మోర్తాడ్ రమేశ్వర్ పీజీ హెచ్ఎం తడపాకల్ మోర్తాడ్ బి.పండరి పీజీ హెచ్ఎం సుంకెట్ మోర్తాడ్ మహేందర్‌రెడ్డి పీజీ హెచ్ఎం నందిపేట నందిపేట ధృపత్కుమార్ పీజీ హెచ్ఎం డొంకేశ్వర్ నందిపేట డి.జె.జ్యోతి టీచర్ నాగేపూర్ నవీపేట లక్ష్మాగౌడ్ హెచ్ఎం నాళేశ్వర్ నవీపేట స్వరూపరాణి ఎస్ఏ, బి.సైన్స్ కులాస్పూర్ నిజామాబాద్ కె.సత్యనారాయణ పీజీ హెచ్ఎం మల్కాపూర్ నిజామాబాద్ గంగకిషన్ ఎస్ఏ, బి.సైన్స్ ఖిల్లా నిజామాబాద్ రామారావు పీజీ హెచ్ఎం బోర్గాం(పి) నిజామాబాద్ బి.సాయిలు ఎస్ఏ, బి.సైన్స్ లింగంపల్లి సదాశివనగర్ వల్లభరావ్ ఎస్ఏ, బి.సైన్స్ ఆడ్లూరు ఎల్లారెడ్డి సదాశివనగర్ గోవర్ధన్‌రెడ్డి పీజీ హెచ్ఎం ఉప్పలవాయి సదాశివనగర్ బిl.వెంకట్‌రెడ్డి పీజీ హెచ్ఎం కల్వారాల్ సదాశివనగర్ అనిల్‌కుమార్ ఎస్ఏ, పీ.సైన్స్ ఉప్పల్వాయి సదాశివనగర్ సి.హెచ్.శంకర్ పీజీ హెచ్ఎం ఓన్నాజీపేట సిరికొండ జి.గంగామోహన్ ఎస్ఏ, పీ.సైన్స్ పల్లికొండ సిరికొండ ఫృథ్వీరాజ్ ఎస్ఏ, పీ.సైన్స్ కృష్ణాజీవాడి తాడ్వాయి సంతోష్ పీజీ హెచ్ఎం పచ్చలనడ్కుడ వేల్పూరు సత్యనారాయణ పీజీ హెచ్ఎం జానకంపేట ఎడపల్లి శ్రీనివాస్‌రెడ్డి పీజీ హెచ్ఎం ఎల్లారెడ్డి(బి) ఎల్లారెడ్డి -
రేపు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
జిల్లావ్యాప్తంగా 90 మంది ఎంపిక కరీంనగర్‌ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ఈ 8న టీఎన్జీఓ ఫంక్షన్హాల్లో సాయంత్రం 5గంటలకు ప్రదానం చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి తెలిపారు. విద్యాశాఖలోని వివిధ కేటగిరీల్లో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరిని ఘనంగా సత్కరించి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
వీడిన టెన్షన్
→ 49 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు → నేడు గురు పూజోత్సవంలో ప్రదానం అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సంబంధించి ఉపాధ్యాయుల టెన్షన్‌కు ఆదివారం తెర పడింది. 75 మందిగల జాబితాను కలెక్టర్‌కు పంపగా ఆ సంఖ్యను 49కి కుదించి ఆయన ఆమోదముద్ర వేశారు. తుది జాబితాను విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. 40 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా వారిలో కేవలం 14 మందిని ఎంపిక చేశారు. పదో తరగతి ఫలితాల ఆధారంగా మరో 35 మందిని ఎంపిక చేశారు. ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే గురు పూజోత్సవంలో వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు. –––––––––––––––––––––––––––– దరఖాస్తు ఆధారంగా ఎంపిౖకైన టీచర్లు –––––––––––––––––––––– సి. బాల నారాయయణస్వామి పీఎస్‌హెచ్‌ఎం ఎస్వీపీ మునిసిపల్ స్కూల్, హిందూపురం ఈ.సుధాకర్‌రెడ్డి ఎస్ఏ గణితం, ఎంపీయూపీఎస్ కమ్మవారిపల్లి ఎ.ఉషారాణి ఎస్ఏ సోషియల్, ఎంపీయూపీఎస్ పంపనూరు ఎస్. శైలజ ఎస్జీటీ, ఎంపీయూపీఎస్ కామారుపల్లి బీఎన్ కష్ణవేణి ఎస్జీటీ ఎంపీయూపీఎస్, మేళాపురం జె.నాగప్ప పీఎస్‌హెచ్‌ఎం, మునిసిపల్ స్కూల్ ధర్మవరం ఎం.హరినారాయణరెడ్డి పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్ పెద్దపొడమల ఆర్. గణేనాయక్ పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్ కంచిసముద్రం ఆర్.నారాయణస్వామి పీఎస్‌హెచ్‌ఎం ఎంపీపీఎస్ గొళ్ల జి.లక్ష్మీనరసమ్మ ఎస్జీటీ, ఎంపీపీఎస్ గుట్టూరు ఎస్.రంగేనాయక్ ఎస్జీటీ, ఎంపీపీఎస్ అరవకూరు కె.సుజాత ఎస్జీటీ, ఎంపీపీఎస్ నందమూరినగర్ డి.రాజశేఖర్ ఎస్జీటీ, ఎంపీపీఎస్ పెద్దగుట్లపల్లి ఎన్బీపీ శివశంకరయ్య ఎస్జీటీ, ఎంపీపీఎస్ గొల్లపల్లి ––––––––––––––– పదో తరగతి ఫలితాల ఆధారంగా ఎంపిౖకైన టీచర్లు –––––––––––––––––––– అనంతపురం డివిజన్ : ఎ.నాగసత్య, కేజీబీవీ, బుక్కరాయసముద్రం సి.నర్మద, కేజీబీవీ, శింగనమల కె.కవిత, ప్రభుత్వ బాలికల పాఠశాల, నార్పల ఎంకే షమ, టీజీటీ, మోడల్ స్కూల్ రాప్తాడు కె.సుధాకర్‌రెడ్డి, పీజీటీ, ఏపీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కరుగుంట రోజమ్మ, ఎస్ఏ గణితం, ఎల్‌ఆర్‌జీ స్కూల్ బాలయ్య, ఎస్ఏ బీఎస్, ఎల్‌ఆర్‌జీ స్కూల్ ఎస్. తస్లీంభాను, ఎస్ఏ సోషల్ (ఉర్దూ), కొత్తూరు ప్రభుత్వ పాఠశాల, అనంతపురం ––––––––––––– పెనుకొండ డివిజన్ : ––––––––––––––– వాదిరాజు, ప్రిన్సిపల్, బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, లేపాక్షి వాసుదేవరెడ్డి, ప్రిన్సిపల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, కొడిగెనహళ్లి ఎన్.సరస్వతి, పీజీటీ బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, లేపాక్షి శ్రీనివాసులు, టీజీటీ ఏపీ మోడల్ స్కూల్, అగళి జి.మధుసూదనమూర్తి, పీజీటీ, బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, లేపాక్షి వి. నారాయణ, పీజీటీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, మలుగూరు కె.శ్రీలత, ఎస్ఏ బీఎస్, జెడ్పీహెచ్ఎస్ గుడిబండ అనిత కేజీబీవీ అమరాపురం ––––––––––––––– ధర్మవరం డివిజన్ ––––––––––––––– బి.కష్ణ, జెడ్పీహెచ్ఎస్ గాండ్లపెంట జి.సంజీవరాజు, ప్రిన్సిపల్, బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, పేరూరు గంగాధర్‌నాయుడు, ఎస్ఏ తెలుగు, మునిసిపల్ బాలికల పాఠశాల, ధర్మవరం శ్వేత, ఎస్ఏ హిందీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపుల జేఎంఆర్ పరిమిల, ఎస్ఏ ఇంగ్లీష్, మునిసిపల్ స్కూల్ ధర్మవరం ఎన్.ఓబులపతి, ఎస్ఏ గణితం, జెడ్పీహెచ్ఎస్ గాండ్లపెంట ఎస్.సబూర్, పీజీటీ ఏపీ మోడల్ స్కూల్, ఆమడగూరు నజ్రుల్లాబాషా, పీజీటీ, ఏపీ మోడల్ స్కూల్ ఆమడగూరు ఎస్. శ్రీరామంనాయక్, ఎస్ఏ సోషల్, జెడ్పీహెచ్ఎస్ ఆమడగూరు –––––––––––– గుత్తి డివిజన్ : –––––––––––––– ఎన్.మహలక్ష్మీ, కేజీబీవీ బొమ్మనహాల్ పి.వెంకటలక్ష్మీ, కేజీబీవీ రాయదుర్గం జి. చిన్ననాగప్ప, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పామిడి కె. కష్ణవేణి, ఎస్ఏ హిందీ, ప్రకాశం మునిసిపల్ స్కూల్ తాడిపత్రి ఎ.విజయభాస్కర్, పీజీటీ, ఏపీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ కనేకల్ కె.ఖాజాబాషా, ఎస్ఏ గణితం, జెడ్పీహెచ్ఎస్, యాడికి పి.వెంకటేశ్వరప్రసాద్, పీజీటీ, ఏపీ మోడల్ స్కూల్ తాడిపత్రి కె. కిషోర్ పీజీటీ, ఏపీ మోడల్ స్కూల్, తాడిపత్రి కురుషాబి, కేజీబీవీ బెళుగుప్ప -
రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు వీరే..
⇒ ఎంపికైన వారి పేర్లను ప్రకటించిన పాఠశాల, ఉన్నత విద్యాశాఖలు ⇒ రేపు అవార్డులను ప్రదానం చేయనున్న సీఎం కేసీఆర్ ⇒ అవార్డు గ్రహీతలకు రూ.10వేల నగదు, వెండి పతకం హైదరాబాద్: గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఉత్తమ టీచర్లను ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి అత్యుత్తమ సేవలందిస్తున్న టీచర్లను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2015లకు పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. అలాగే వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉత్తమ సేవలందిస్తున్న అధ్యాపకులను, ఆచార్యులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరందరికీ శనివారం రవీంద్రభారతిలో జరగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.10వేల నగదు, వెండి పతకం, ప్రశంసాపత్రాలను ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు పీఆర్బీ చంద్రప్రకాశ్, రామడుగు, కరీంనగర్ జిల్లా వి.కుమారస్వామి, చిగురు మామిడి, కరీంనగర్ జిల్లా ఎం.డి. ఉమర్అలీ, కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా కె.విజయసేనారెడ్డి, జూలపల్లి, కరీంనగర్ జిల్లా కె.అంజిరెడ్డి, తిపర్తి, నల్లగొండ జిల్లా సీహెచ్ రాములు, పోచంపల్లి, నల్లగొండ జిల్లా ఎం.వెంకట్రామిరెడ్డి, ఆత్మకూరు, న ల్లగొండ జిల్లా ఎన్.వెంకట్‌రెడ్డి, చివేముల, నల్లగొండ జిల్లా వి.శ్రీనివాసులు, గుర్రంపూడె, నల్లగొండ జిల్లా ఎం.బుచ్చిరెడ్డి, బిజినేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గాడి సురేందర్, బిజినేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా ఎన్.కృష్ణయ్య, జడ్చెర్ల, మహబూబ్‌నగర్ జిల్లా కె.సారంగపాణి, ఆత్మకూరు, వరంగల్ జిల్లా పి.వేణుగోపాల్, వరంగల్ , వరంగల్ జిల్లా వై.వెంకటేశ్వర్లు, ఖమ్మం, ఖమ్మం జిల్లా ఎం.జ్యోతిరాణి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా డి.శ్రీనివాస్, తాండూరు, రంగారెడ్డి జిల్లా కె.సురేందర్, నిర్మల్, అదిలాబాద్ జిల్లా ఆర్.నర్సప్ప, సంగారెడ్డి, మెదక్ జిల్లా నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్-2015 అవార్డుకు ఎంపికైన వారు వై.హరికృష్ణ, తుంగతుర్తి, నల్లగొండ జిల్లా ఎం.వెంకటనర్సారెడ్డి, నంగనూరు, మెదక్ జిల్లా వి.ప్రభాకర్, చెమళ్లపల్లి, కరీంనగర్ జిల్లా టి.తిరుపతయ్య, సైదాపూర్, కరీంనగర్ జిల్లా కె.ఉమాదేవి, మధిర, ఖమ్మం జిల్లా ఎస్.సూర్యారావు, ఖమ్మం, ఖమ్మం జిల్లా డి.అన్నమ్మ, బోరబండ, హైదరాబాద్ జిల్లా జి.రవీందర్, త్రిపురారం, నల్లగొండ జిల్లా కళాశాల లెక్చరర్ల కేటగిరీలో.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుంచి.. డాక్టర్ కె.చంద్రశేఖర్, మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్, మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ డాక్టర్ ఎస్.రాజేంద్రప్రసాద్, సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి డాక్టర్ కె.నర్సింహులు, జీజేసీ ప్రిన్సిపల్,యెల్దుర్తి, మెదక్ జిల్లా జె.కృష్ణయ్య, జీజేసీ ప్రిన్సిపాల్, చింతపల్లి, నల్లగొండ జిల్లా విద్యాసాగర్, ప్రిన్సిపల్ కేఆర్ఆర్ జూనియర్ కాలే జి, కోదాడ, నల్లగొండజిల్లా ఎ.బీనారాణి, జీజేసీ ప్రిన్సిపాల్, ఖానాపూర్, కరీంనగర్ జిల్లా ఎం.రజియుద్దీన్, లెక్చరర్, జీజేసీ నిజామాబాద్ జి.అనసూయ, జీజేసీ ప్రిన్సిపల్, హయత్‌నగర్ జి.శ్రీదేవి, జీజేసీ లెక్చరర్, హయత్‌నగర్ యూనివర్సిటీల నుంచి.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.. బి.ఎన్.రెడ్డి బోటనీ ప్రొఫెసర్, ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాల డాక్టర్ సుదర్శన్ , ఉస్మానియా వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.భీమ, మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా వర్సిటీ (యంగ్ టీచర్ అవార్డు) జేఎన్టీయూహెచ్ నుంచి.. డాక్టర్ నర్రి యాదయ్య, రిజిస్ట్రార్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ క ళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. వెంకటేశ్వర్రావు, వాటర్ రిసోర్సెస్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి వి.కిషన్, ఫార్మసీ ప్రొఫెసర్ బన్నా ఐలయ్య, తెలుగు ప్రొఫెసర్ సి.వీరేశం, ఫార్మసీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి.. తాటికుంట రమేశ్, క్రాప్ సైకాలజీ ప్రొఫెసర్ కె.సుహాసిని, అగ్రి ఎకనామిక్స్ ప్రొఫెసర్ జి.పద్మజ, సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ నుంచి.. ఇ.సుధారాణి, హిస్టరీ ప్రొఫెసర్ కె.సతీశ్‌రెడ్డి, ఎకనామిక్స్ ప్రొఫెసర్ కాళోజి నారాయణరావు ఆరోగ్య వర్సిటీ నుంచి డాక్టర్ కె.మనోహర్, మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.ధైర్యవన్, న్యూరాలజీ విభాగధిపతి డాక్టర్ పి.ప్రతాప్‌రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నటీ యూనివర్సిటీ నుంచి.. డాక్టర్ ఎం.జ్ఞానప్రకాశ్, యానిమల్ జెనెటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.టి.విరోజిరావు, యానిమల్ జెనెటిక్స్ ఫ్రొఫెసర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి.. బి.రమేశ్, ఫోక్ అండ్ ట్రైబల్ లోర్ స్కూల్ డీన్, వరంగల్ పీఠం జేఎన్ఏఎఫ్ఏయూ నుంచి.. డాక్టర్ ఎస్.ఎన్.వికాస్, ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ నుంచి.. పి.కనకయ్య, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఓయూ అనుబంధ కళాశాలల నుంచి పి.హరిలతారెడ్డి, రీడర్ ఇన్ కెమిస్ట్రీ, సరోజిని నాయడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి డాక్టర్ స్మిత ఆస్తానా, రీడర్ ఇన్ కెమిస్ట్రీ, సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల, మెహదీపట్నం డాక్టర్ ఎ.చంద్రయ్య, రీడర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వివేకవర్ధిని కళాశాల, జాంబాగ్ ఎ.కేశవరావు, ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్ బి.రాజేంద్రకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథ్స్, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి సి.దయాకర్, కామర్స్ అసోసియేట్ ప్రొఫెసర్,ఎన్జీ కళాశాల, నల్లగొండ కాకతీయ వర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి డాక్టర్ జి.పద్మావతి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నేలకొండ పల్లి, ఖమ్మం జిల్లా పి.సౌభాగ్యలక్ష్మి, జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్.ఆర్.ప్రభుత్వ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెం డాక్టర్ మేరీ మైఖేల్, రీడర్ ఇన్ హిందీ, లాల్‌బహదూర్ కళాశాల, వరంగల్ సిహెచ్.నారాయణరెడ్డి, జువాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల. -
ఉత్తమ టీచర్ల జాబితాపై గోప్యం
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ దినోత్సావాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయిలో ఇచ్చే అవార్డులకు ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా ప్రకటనలో విద్యాశాఖ వైఖరి ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ రేపింది. జాబితాను శుక్రవారం సాయంత్రం వరకు ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు, నిర్ధేశాల మేరకు ఎంపిక చేసిన జాబితా శుక్రవారం ఉదయానికే సిద్ధమయింది. అయితే దాన్ని ప్రకటించకుండా గోప్యత పాటించారు. రాజకీయ ఒత్తిళ్లతో తుదిజాబితాను మార్చడానికే ప్రకటించడంలేదని ఉపాధ్యాయ వర్గాలు అనుమాన పడుతున్నాయి. జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా శుక్రవారం రాత్రి గ్రహీతలకు నేరుగా ఫోన్‌చేసి చెప్పినట్టు సమాచారం. ఇలా రహస్యంగా తెలియజేయడంలో ఆంతర్యమేంటని ఉపాధ్యయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జిల్లాలో కనీసం 15 ఏళ్ల సర్వీసులో ఆదర్శ సేవలందించిన వివిధ కేడర్‌కు చెందిన 28 మందిని ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. అయితే ఎంపికైన ఉపాధ్యాయుల పేర్లు, వివరాలను తెలిపేందుకు ఆయన నిరాకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో సత్కరిస్తామని డీఈఓ తెలిపారు. -
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి జాబితాను విద్యా శాఖ మంగళవారం రాత్రి ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విభాగంలో 21 మంది, నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అవార్డ్స్-2014 కింద 17 మంది ఎంపికయ్యారు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆరుగురిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ప్రైమరీ టీచర్లు: డాక్టర్ ఎస్.వెంకటరామరాజు( స్కూల్ అసిస్టెంట్, యూపీఎస్ మక్తా, నల్గొండ), బి. వెంకట సుబ్బలక్ష్మి (ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎంపీపీఎస్, పోలంపల్లి, కరీంనగర్), టి.గంగన్న(హెడ్ మాస్టర్, పీఎస్ యాపల్‌గూడ, ఆదిలాబాద్). జాతీయ ఉత్తమ సెకండరీ టీచర్లు: బొడ్డు వెంకటేష్(గెజిటెడ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్ సిరిపురం, నల్గొండ), పారుపల్లి సురేష్(స్కూల్ అసిస్టెంట్, జీహెచ్ఎస్ మోమినన్, ఖమ్మం), నన్నపరాజు విజయశ్రీ(స్కూల్ అసిస్టెంట్ , జెడ్పీహెచ్ఎస్ నాదర్గుల్, రంగారెడ్డి). ఏపీలో 45 మంది: ఏపీలో 45 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ ప్రభుత్వం ఎంపిక చేసింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) అవార్డులకు మరో 29 మందిని ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరందరికీ గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.