రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు | education prairty | Sakshi
Sakshi News home page

రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు

Published Thu, Sep 8 2016 10:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు - Sakshi

రూ.120 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు

  • విద్యారంగానికి పెద్దపీట 
  • ఉపాధ్యాయులదే గురుతరమైన బాధ్యత
  • జిల్లాను రోల్‌మోడల్‌గా తయారు చేద్దాం
  • మహనీయుల కలలను నిజచేద్దాం
  • మంత్రి ఈటల రాజేందర్‌
  • కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.120 కోట్లతో ప్రణాళిక రూపొందించామని, త్వరలో నిధులు విడుదల చేసి అమలుచేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కరీంనగర్‌ టీఎన్‌జీవో ఫంక్షన్‌హాల్‌లో గురువారం జరిగింది. వివిధ కేటగిరీలకు చెందిన 90 మంది ఉపాధ్యాయులకు మెమెంటోలు, శాలువాలతో జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యాలయాలను సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజల బాగోగులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎన్‌టీపీసీ వంటి సంస్థల సహకారంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర వస్తువులు, భవన నిర్మాణాలు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో మౌలికవసతుల కోసం జిల్లా ప్రజాప్రతినిధులు రూ.40 కోట్లు, మంత్రి కడియం శ్రీహరి రూ.80 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, అవి త్వరలోనే నిధులు రానున్నాయని అన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, మౌలిక వసతులను మెరుగుపరుస్తూ నాణ్యమైన విద్య అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ §lష్టిసారించారని స్పష్టంచేశారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారద్రోలేందుకు విద్య ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు సహకరించాలని సూచించారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపి నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో రోల్‌ మోడల్‌గా తయారుచేస్తామని, ఇందుకు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సూచించారు. సావిత్రిబాయి పూలే,  బీఆర్‌.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యత వైపు ముందుకు సాగాలని కోరారు. 
    – జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ మాట్లాడుతూ ప్రై వేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. వీర్నపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అందరూ MSషి చేయాలన్నారు.  
    – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజంలో ఉన్న చెడును పారదోలుతూ విద్యార్థులకు ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు.  ప్రై వేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారుచేయాలని సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలలో ఉండేలా MSషి చేయాలని కోరారు.  
    – 
    ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే గురుతరమైన బాధ్యత అని అన్నారు. సమాజ మార్పు కోసం, వ్యవస్థ బాగు కోసం పరితపించే ఉపాధ్యాయులు ప్రై వేట్‌ విద్య జడలు విప్పడంపై దృlష్టిపెట్టాలని కోరారు. 
    –  కలెక్టర్‌ నీతూప్రసాద్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్యాబోధన చేసి పాఠశాలలను పరిరక్షించుకోవాలని కోరారు. నగర మేయర్‌ రవీందర్‌సింగ్, డీఈవో శ్రీనివాసాచారి, ఏజేసీ నాగేంద్ర, డెప్యూటీ ఈవోలు వెంకటేశ్వర్లు, ఆనందం, ýSష్ణమూర్తి, కిశోర్‌కుమార్, కె.శంకర్, మండల విద్యాధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, జాలి మహేందర్‌రెడ్డి, కటుకం రమేశ్, కె.సారయ్య, నూలి మురళీధర్‌రావు, కొమ్ము రమేశ్, చొల్లేటి శ్రీనివాస్, కోహెడ చంద్రమౌళి, మీసాల మల్లిక్, రవినాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement