సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారి జాబితాను విద్యా శాఖ మంగళవారం రాత్రి ప్రకటించింది. జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ విభాగంలో 21 మంది, నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అవార్డ్స్-2014 కింద 17 మంది ఎంపికయ్యారు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆరుగురిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
జాతీయ ఉత్తమ ప్రైమరీ టీచర్లు: డాక్టర్ ఎస్.వెంకటరామరాజు( స్కూల్ అసిస్టెంట్, యూపీఎస్ మక్తా, నల్గొండ), బి. వెంకట సుబ్బలక్ష్మి (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీఎస్, పోలంపల్లి, కరీంనగర్), టి.గంగన్న(హెడ్ మాస్టర్, పీఎస్ యాపల్‌గూడ, ఆదిలాబాద్).
జాతీయ ఉత్తమ సెకండరీ టీచర్లు: బొడ్డు వెంకటేష్(గెజిటెడ్ హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ సిరిపురం, నల్గొండ), పారుపల్లి సురేష్(స్కూల్ అసిస్టెంట్, జీహెచ్‌ఎస్ మోమినన్, ఖమ్మం), నన్నపరాజు విజయశ్రీ(స్కూల్ అసిస్టెంట్ , జెడ్పీహెచ్‌ఎస్ నాదర్‌గుల్, రంగారెడ్డి).
ఏపీలో 45 మంది: ఏపీలో 45 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆ ప్రభుత్వం ఎంపిక చేసింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ (ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ) అవార్డులకు మరో 29 మందిని ఎంపిక చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరందరికీ గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.