60 మంది ’ఉత్తమ గురువులు’
♦ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం.. నేడు ప్రదానం
♦ రూ.10 వేల నగదు, మెమెంటో, సత్కారం
♦ 37 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు
♦ రూ.10 వేల చొప్పున నగదు బహుమతి
సాక్షి, హైదరాబాద్: వివిధ విభాగాల్లో 60 మందిని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు/లెక్చరర్లు/ప్రొఫెసర్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠశాల విద్యలో 23 మంది, ఇంటర్ విద్యలో ముగ్గురు, డి గ్రీ కాలేజీలు, వర్సిటీల్లో 29 మంది, లాంగ్వేజ్ అండ్ కల్చర్ విభాగంలో 5 మంది అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శుక్రవారం ఉత్తమ గురువు అవార్డులు అందుకుంటారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతి, మెమెంటో అందజేసి శాలువాతో సత్కరిస్తారు. అలాగే 37 స్వచ్ఛ విద్యాలయాలకు కూడా పురస్కారాలు ప్రకటించారు. ఒక్కో విద్యాలయానికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ఈ అవార్డులను ఈ నెల 5వ తేదీనే ఇవ్వాల్సి ఉన్నా నిమజ్జనం వల్ల కుదరలేదు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నా ఆయన కంటికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో రాలేకపోవచ్చు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది. మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పాల్గొంటారు.
గతానికి భిన్నంగా ఎంపిక
టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు గతంలో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఎంపికైన వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసేవారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని వారిని కూడా ఎంపిక చేశారు! పలు జిల్లాల్లో సెలవులు పెట్టకుండా, అంకిత భావంతో పని చేసే టీచర్లను గుర్తించి మరీ అవార్డులకు ఎంపిక చేశారు. హెల్త్ వర్సిటీ, వెటర్నరీ, అగ్రి వర్సిటీల పరిధిలోని లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లకు కూడా అవార్డులిచ్చారు. అయితే 57 ప్రభుత్వ కాలేజీలున్న పాలిటెక్నిక్‌లలో ఒక్కరికీ అవార్డు రాలేదు. 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుంటే వాటినుంచి ముగ్గురే ఎంపికయ్యారు. 126 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నుంచి ఇద్దరికి, 25 వేల ప్రభుత్వ పాఠశాలల నుంచి 23 మంది టీచర్లకు అవార్డులు లభించాయి. గతేడాది మొత్తం 70 మందికి అవార్డులిచ్చారు. విద్యా శాఖ/ఎన్‌టీఎఫ్‌డబ్ల్యూ/స్పెషల్ కేటగిరీ కింద రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారు...
పాఠశాల విద్యలో...
స్పెషల్ కేటగిరీలో..
ఇంటర్మీడియట్ విద్యలో..
కళాశాల విద్యలో డిగ్రీ లెక్చరర్లు/యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
అనుబంధ కాలేజీల్లో...
లాంగ్వేజ్ అండ్ కల్చర్‌లో...
(నోటు: ఎస్‌ఏ-స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ-సెకండరీ గ్రేడ్ టీచర్, జీహెచ్‌ఎస్-గెజిటెడ్ హెడ్‌మాస్టర్, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం లో ఫిమేల్ లిటరసీ హెడ్‌మాస్టర్, హెచ్‌ఎం-హెడ్‌మాస్టర్, జేఎల్-జూనియర్ లెక్చరర్, జీజేసీ-గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఓయూ-ఉస్మానియా యూనివర్సిటీ, కేయూ-కాకతీయ యూనివర్సిటీ, ఎస్‌యూ-శాతవాహన యూనివర్సిటీ, జీడీసీ-గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ)