తిరుమలలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు
తిరుమల: తిరుమలలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నేపాల్‌కు చెందిన రవికుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. తిరుమలలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానిక దుకాణసముదాయం రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘనస్థలికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినండంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.