
విసుగులు... విస్మరింపులు!
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విసుక్కోవడాలు, విస్మరింపుల మధ్య నిస్సారంగా జరిగింది. సమావేశంలో ప్రాధాన్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విసుక్కోవడాలు, విస్మరింపుల మధ్య నిస్సారంగా జరిగింది. సమావేశంలో ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టి, అవసరం లేని అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనికి తోడు పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టరే అన్నింటికీ స మాధానం చెప్పాల్సి వచ్చింది. సమావేశ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇద్దరు, జెడ్పీటీసీలు 13 మంది సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.
జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ చైర్ ప ర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తదితరులు హజరయ్యారు. సమావేశంలో చర్చలకు అజెండాగా జిల్లాలో 61 ప్ర భుత్వ రంగ విభాగాల్లో చర్చ జరగాల్సి ఉండగా... పదింటిపైనే చర్చ జరిగింది. గ్రామీణ నీటి పారుదల శాఖ, డీఆర్‌డీఏ, డుమా, గృహనిర్మాణ సంస్థ, జిల్లా సహకార శాఖ, మ త్స్యశాఖ, జిల్లా మహిళాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ తదితర ప్రధాన శాఖలను ఈ సమావేశంలో విస్మరించారు.
ప్రశ్నలు ఓకే... సమాధానాలు వీకే!
సమావేశానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హాజరు కాలేదు. దీనిపై కలెక్టర్ పి.లక్ష్మీ నృ సింహం, మంత్రి అచ్చెన్నాయుడులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జిల్లా వైద్యశాఖాధికారి బదిలీపై వెళ్లిపోవడంతో కింది స్థాయి అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. వయోజనవిద్య, నెడ్‌కాప్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని మంత్రి, విప్‌లు అసంతృప్తి వ్యక్తంచేశారు. భూగర్భ జలశాఖ అధికారులు ఎన్టీఆర్ జలసిరి పథకం మంజూరుకు కావాల్సి న అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, వేగవం తం చేయాలని అధికారులను అదేశించారు. బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు ఇవ్వకపోతే ఫిర్యాదుచేయాలని మంత్రి అచ్చెన్న సూచించారు. ప్రభుత్వ వైద్యశాఖలో ప్రసూతి వైద్యులను నియమించాలని సభ్యులు కోరగా, ైవె ద్యుల కొరత ఉందని కలెక్టర్ తెలిపారు.
ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు లేనందున, పలు ఆస్పత్రుల్లో పర్యవేక్షణ లోపం ఉందని కమిటీలు ఏ ర్పాటు చేయాలని సభ్యులు కోరగా... మూడు రోజుల్లో జిల్లాలో ఎన్ని ఆస్పత్రులకు కమిటీలు లేవో వివరాలు అందజేయాలని మంత్రి సం బంధిత అధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఈ కమిటీలు పాతపట్నం, టెక్కలి తదితర ఆస్పత్రులో ఏర్పాటు చేయలేదని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తెలిపారు. అలాగే కిడ్నీ రోగాలను గుర్తించేందుకు ‘మెడాల్’ అనే ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పారని, ఆ మెడికల్ రిపోర్టులు పూర్తిగా తప్పులు వస్తున్నాయని, వాటిని రోగికి అందజేయకపోవడంతో సమస్యగా మారుతోందని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని శివాజీ కోరారు.
104 వాహనాలు నెలలో ఎక్కడెక్కడ సందర్శించనున్నాయో తెలియజేసే చార్టులను సంబంధిత శాసన సభ్యులకు అంద జేయాలని, అయితే గత సమావేశంలో చర్చిం చినా, ఇప్పటివరకు అమలులోకి రాలేదని, తక్షణం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వస తి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే యూనిఫారాల కుట్టు పని స్థానికంగా ఉన్న మహిళలకు అప్పగించాలని కలెక్టర్ మంత్రిని కోరారు. ఉపాధి కల్పనా కార్యక్రమంలో భాగంగా మహిళలకు న్యాప్‌కిన్స్, ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేయాలని, ఈ ఉత్పత్తులను కేజీబీవీ, వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేసేందుకు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.