కాల్‌ చేస్తే మాట్లాడడం లేదని.. నమ్మించి.. మైకో లేఔట్‌కి పిలిపించి.. | - | Sakshi
Sakshi News home page

సైకో టెక్కీ.. ప్రియురాలిపై ఉన్మాదం..

Aug 6 2023 12:06 AM | Updated on Aug 6 2023 10:16 AM

- - Sakshi

కర్ణాటక: వేరే సంస్థలో చేరిన ప్రియురాలు తనతో ఫోన్‌లో మాట్లాడడం లేదనే ఆక్రోశంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆమెను చావబాదాడు. ఈ ఘటన బెంగళూరు మైకోలేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. గాయాలైన యువతి స్నేహసిక్త చటర్జీ (26) నిమ్హాన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సైకో ప్రియుడు రవికుమార్‌ (28)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరిద్దరూ ఐటీ ఇంజినీర్లు. రవికుమార్‌ ఇందిరానగరలో ఓ సంస్థలో పని చేస్తుండగా స్నేహ అక్కడ శిక్షణకు వచ్చింది. వారి మధ్య పరిచయమై ప్రేమకు దారి తీసింది. ఇటీవల స్నేహకు మరో కంపెనీలో ఉద్యోగం రాగా అక్కడకు వెళ్లిపోయింది. అప్పటినుంచి రవికుమార్‌ కాల్‌ చేస్తే సరిగా మాట్లాడడం లేదు.

ఈ నెల 3న తెల్లవారుజామున స్నేహను మైకో లేఔట్‌లోని తను ఉంటున్న హాస్టల్‌ వద్దకు పిలిపించాడు. ఎందుకు నాతో మాట్లాడడం లేదని ఆమెతో ఘర్షణ పడి ఇనుప రాడ్‌తో తలపై బాదటంతో గట్టి గాయాలయ్యాయి. కొందరు చూసి బాధితురాలిని నిమ్హాన్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మైకోలేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement