Virat Kohli: "ఇప్పటి నుంచే నన్ను ఔట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తావా ఏంటి..?"  | U19 Bowler Ravi Kumar Asked Virat Kohli About His Weakness, Kohli Gives Stunning Reply | Sakshi
Sakshi News home page

Virat Kohli: "ఇప్పటి నుంచే నన్ను ఔట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తావా ఏంటి..?" 

Published Mon, Feb 7 2022 9:07 PM | Last Updated on Thu, Jun 9 2022 7:12 PM

U19 Bowler Ravi Kumar Asked Virat Kohli About His Weakness, Kohli Gives Stunning Reply - Sakshi

U19 Bowler Ravi Kumar Vs Virat Kohli: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన యువ భారత జట్టులో కీలక ఆటగాడైన రవికుమార్.. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మెగా ఫైనల్‌కు ముందు జరిగిన ఓ సంభాషణ సందర్భంగా కోహ్లి తనకి కౌంటరిచ్చాడని రవికుమార్‌ పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు జట్టులో స్ఫూర్తినింపేందుకు వీడియో కాల్‌ మాట్లాడిన కోహ్లిని తాను ఓ చిరాకు తెప్పించే ప్రశ్న అడిగానని, అందుకు కోహ్లి తనదైన స్టైల్‌లో ఫన్నీగా సమాధానమిచ్చాడని రవికుమార్‌ చెప్పుకొచ్చాడు. తాను కోహ్లిని బ్యాటింగ్‌ బలహీనత గురించి అడగ్గా, అందుకు అతను బదులిస్తూ.. "ఎందుకు.. ఇప్పటి నుంచే నన్ను ఔట్‌ చేసేందుకు ప్లాన్‌​ చేస్తావా..?" అంటూ ఫన్నీగా కౌంటరిచ్చాడని రవికుమార్‌ తెలిపాడు. 

కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన అండర్19 ప్రపంచకప్ ఫైనల్‌లో రవికుమార్‌ 4 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే, రవికుమార్‌ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తాను బౌలర్‌ అయినప్పటికీ.. తన ఆరాధ్య క్రికెటర్‌ ధోని అని, ఫేవరెట్‌ బౌలర్‌ విషయానికొస్తే.. ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ని అమితంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్‌ మెగా వేలంలో తప్పక అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల రవికుమార్‌.. తన క్రికెటింగ్‌ కెరీర్‌ కోసం కోచ్‌ సలహా మేరకు యూపీ నుంచి బెంగాల్‌కు వలస వెళ్లాడు. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ కూడా రవికుమార్‌లాగే గతంలో యూపీ నుంచి బెంగాల్‌కు వలస వెళ్లి స్టార్‌ బౌలర్‌గా ఎదిగాడు.  
చదవండి: Virat Kohli: కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు.. ఆ ఓటమి ఇప్పటికీ బాధిస్తుంది..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement