రియల్‌ ఏజెంట్‌పై నటుడు జగ్గేశ్‌ దాడి | Actor Jagès attacked the real agent | Sakshi
Sakshi News home page

రియల్‌ ఏజెంట్‌పై నటుడు జగ్గేశ్‌ దాడి

Published Sun, Apr 8 2018 7:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

యశవంతపుర: మల్లేశ్వరంలో నటుడు జగ్గే శ్, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటంతో వి వాదంగా మారింది. వివరాలు... మల్లేశ్వరం 8వ క్రాస్‌లో వరసకు బావైన మండల మాదేగౌడ కాయకూరల వ్యా పారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో రియల్‌ ఏజెంట్‌ రవికుమార్‌ అంగడి వద్ద వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని మాదేగౌడతో అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. ఈ విషయం మాదేగౌడ నటుడు జగ్గేశ్‌ దృష్టికి తీసుకురావటంతో స్థానిక కార్పోరేటర్‌ మంజణ్ణను కారులో తీసుకుని వెళ్లాడు.

 దీంతో ఒక్కసారిగా జగ్గేశ్‌ రవికుమార్‌పై రోల్‌కాల్‌కు వచ్చావంటూ దాడికి పాల్పడిన్నట్లు వైరల్‌ అయింది. తను దాడి చేయలేదని బావ మాదేగౌడ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయాటనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తలకు పట్టుకుని పోలీసులకు అప్పగించిన్నట్లు జగ్గేశ్‌ వివరించారు. ఏవరో విడియో రికార్డు చేసి తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నట్లు జగ్గేశ్‌ పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement