Real estate agent
-
సినిమా రంగంలోకి ఆదిత్య పాపగారి
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కంటెంట్‌నే నమ్ముకొని వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ హిట్ కొడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపార వేత్తల కన్ను టాలీవుడ్‌పై పడింది. ఇతర రంగాలలో రాణిస్తున్నవారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో తక్కువ బడ్జెట్లో సినిమాను నిర్మించి విజయం సాధిస్తున్నారు. తాజాగాప్రముఖ రియల్టర్ ఆదిత్య పాపగారి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది తన మోటో అని ఆదిత్య పాపగారి అన్నారు. -
కక్కుర్తి పడ్డాడు.. రూ.5 లక్షలను రూ. 65 లక్షలు చేసి.. కథ అడ్డం తిరగడంతో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): లేనిదాని కోసం అత్యాశకు పోతే చేతిలో ఉన్నది పోయినట్లు ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ తనకు కమీషన్ కింద ఇచ్చిన చెక్కును ఎక్కువ మొత్తం దిద్ది కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... అంజినప్ప అనే వ్యక్తి దొడ్డ తాలూకాలో రెండెకరాల భూమిని చంద్రశేఖర్ అనే ఏజెంట్ సహాయంతో కొనుగోలు లావాదేవీలు నిర్వహించాడు. ఇందుకుగాను ఆయన ఏజెంట్ చంద్రశేఖర్‌కు రూ.10 లక్షల కమీషన్‌ను ఐదేసి లక్షలు చొప్పున 2 చెక్కులు ఇచ్చాడు. ఒకసారి రూ.5 లక్షలు డ్రాచేసుకున్న చంద్రశేఖర్ రెండో చెక్ విషయంలో దురాశ పడ్డాడు. రూ.5 లక్షలకు ముందు 6 చేర్చి రూ.65 లక్షలుగా దిద్ది బ్యాంకులో చెక్కును ఇచ్చాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అంజినప్పకు ఫోన్ చేసి విచారించగా, తాను ఇచ్చింది రూ.5 లక్షల చెక్ మాత్రమేనని చెప్పాడు. దీంతో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. చదవండి హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి? -
74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Oldest Real Estate Agent: వయసు శరీరానికే కానీ ఉత్సాహానికి కాదు.. వృద్ధాప్యం దేహానికే కానీ నిరంతరం పనిచేసే తత్వానికి కాదు.. అని నిరూపిస్తున్నారు ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ముంబైలోని ములుండ్ మైక్రో-మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్ఎం మాల్డే. ఓల్డెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మే 20న మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) నిర్వహించిన యోగ్యత పరీక్షలో 74 ఏళ్ల వయసులో ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం మార్కులు సాధించారు. మాల్డే నాలుగు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ వయసులో పరీక్ష ఎందుకు? ఈ వయసులో మాల్డే పరీక్ష ఎందుకు రాశారో మనీ కంట్రోల్ వార్తా సంస్థకు తెలియజేశారు. తాను పరీక్ష రాయడానికి కారణాలు కేవలం రెండే రెండు. ఒకటి ఈ పరీక్ష ఉత్తీర్ణులైనవారికి అధీకృత రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా గుర్తిస్తుంది. రెండోది మరికొన్ని ఏళ్లపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేయాలనేది. తాను ఇన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తనకు అధీకృత గుర్తింపు లేదని, ఈ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాక ఇప్పుడు తనకు గుర్తింపు లభిస్తుందని మాల్డే చెబుతున్నారు. మహారేరా మొదటి బ్యాచ్ పరీక్షకు మాల్డే హాజరయ్యారు. దీని ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అప్పుడు కొంత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తాను కోలుకుని మళ్లీ తన వృత్తిలోకి వచ్చేశానని, మంచి ఇల్లు కొనాలనుకునేవారికి మంచి సలహాలు, సూచనల ద్వారా సహాయం అందిస్తుంటానని మాల్డే పేర్కొన్నారు. తనకు వ్యాపారం అన్నది ప్రాధాన్యం కాదని, కొనుగోలుదారులకు సరైన గైడెన్స్ ఇవ్వాలన్నది తన ప్రథమ సంకల్పమని వివరించారు. అందుకు తనకు ముంబై ప్రాంతంలో మంచి పేరు ఉందని చెప్పారు. చిన్న గది నుంచి ప్రీమియం అపార్ట్మెంట్ వరకు.. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వృత్తిలో తన ప్రయాణం గురించి మాల్డే మాట్లాడుతూ.. తాను ఒక చిన్న గదిలో నివసించానని, ఈ రోజు ములుండ్ ప్రాంతంలో ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంటున్నానని గర్వంగా చెప్పారు. 750 చదరపు అడుగుల కార్పెట్‌తో కూడిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ అది. తనకు గుర్తింపుతోపాటు అన్ని ఇచ్చిన తన వృత్తికి ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా మాల్డే కుమార్తె యూకేలో ఉంటున్నారు. తన 40 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కెరీర్లో మాల్డే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో 20,000కుపైగా లావాదేవీలు చేసుంటారు. ఇప్పటికీ నెలలో కనీసం మూడు లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నారాయన. వీటిలో ఒకటి తన కోసం, మరొకటి తన ఉద్యోగుల ఖర్చుల కోసం, మిగిలినది తన ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసమని మాల్డే వివరించారు. కాగా మహారేరా మే 20 న నిర్వహించిన యోగ్యత పరీక్షకు హాజరైనవారిలో 95 శాతం ఉత్తీర్ణులయ్యారని మే 30న ప్రకటించింది. మొదటి బ్యాచ్ పరీక్షకు 423 మంది హాజరుకాగా 405 మంది ఉత్తీర్ణులయ్యారు. గృహ కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వారిధిగా వ్యవహరించే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో దాదాపు 39,000 మంది మహారేరా నమోదిత రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ రిజిస్ట్రేషన్‌ను వీరు పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➦ పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
వాట్సాప్‌లో కామెంట్లు.. అంతలోనే..
ఔరంగాబాద్ : ఓవైపు వాట్సాప్‌లో నకిలీ వార్తలతో అమాయకులపై దాడులు జరుగుతోంటే.. మరోవైపు నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్విన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే మోయిన్ మెహమూద్ పఠాన్ (35)పై దాదాపు 20 మంది వ్యక్తులు కత్తులు, తల్వార్లతో మూక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హర్సూల్ ప్రాంతంలోని ఫాతిమానగర్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన పఠాన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సాంయత్రం వాట్సాప్‌లో పఠాన్ చేసిన కామెంట్లు ప్రత్యర్థి వర్గాన్ని ఈ దాడికి ఉసిగొల్పాయని అంటున్నారు. దమ్ముంటే తనతో తేల్చుకోవాలని పఠాన్ చాలెంజ్ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే.. వాట్సాప్‌లో రెచ్చగొట్టే కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 20 మంది సమూహం పఠాన్‌పై దాడి చేసిందని ఆయన మేనల్లుడు ఇర్ఫాన్ షైక్ తెలిపాడు. తన మామపై జరుగుతున్న దాడిని అడ్డుకోబోయినందుకు ఇర్ఫాన్‌ను కూడా తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనతో ప్రమేయమున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేశామని వెల్లడించారు. -
రియల్ ఏజెంట్‌పై నటుడు జగ్గేశ్ దాడి
యశవంతపుర: మల్లేశ్వరంలో నటుడు జగ్గే శ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో వి వాదంగా మారింది. వివరాలు... మల్లేశ్వరం 8వ క్రాస్‌లో వరసకు బావైన మండల మాదేగౌడ కాయకూరల వ్యా పారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో రియల్ ఏజెంట్ రవికుమార్ అంగడి వద్ద వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని మాదేగౌడతో అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. ఈ విషయం మాదేగౌడ నటుడు జగ్గేశ్ దృష్టికి తీసుకురావటంతో స్థానిక కార్పోరేటర్ మంజణ్ణను కారులో తీసుకుని వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా జగ్గేశ్ రవికుమార్‌పై రోల్‌కాల్‌కు వచ్చావంటూ దాడికి పాల్పడిన్నట్లు వైరల్ అయింది. తను దాడి చేయలేదని బావ మాదేగౌడ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయాటనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తలకు పట్టుకుని పోలీసులకు అప్పగించిన్నట్లు జగ్గేశ్ వివరించారు. ఏవరో విడియో రికార్డు చేసి తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నట్లు జగ్గేశ్ పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
కరీనా క్యా డీల్!
బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్ ఒక సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలియదు గానీ... ఆమె ప్రాపర్టీకి మాత్రం మాంచి గిరాకీ తగిలింది. ముంబైలోని తన 2050 ఎస్ఎఫ్టీ బిగ్ ఫ్లాట్‌ను దాదాపు పదిహేను కోట్ల రూపాయలకు అమ్మిందట. వాస్తవానికి ఇవి రెండు ఫ్లాట్లు. ఒకటి కరీనాది. ఇంకోటి ఆమె తల్లిది. పక్కపక్కనే ఉన్న ఈ ఫ్లాట్స్‌ను కలిపేసి విశాలంగా మలుచుకున్నారు. రేటు భారీగా ఉండటం వల్ల మూడేళ్ల కిందటే అమ్మకానికి పెడితే... ఇప్పటికి వర్కవుటయింది. సెలబ్రిటీ ట్యాగ్‌తోనే ధర అంతగా ఉందని, ఆ రేంజ్లో క్లయింట్‌ను వెతికి పట్టుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందని రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పాడు. ఇన్ని రోజులు వెయిట్ చేసినా అనుకున్న అమౌంట్ వచ్చినందుకు కరీనా ఖుషీగా ఉందట! ఈ అమ్మడే కాదు... బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ రీసెంట్గా 41.4 లక్షల రూపాయలకు ఓ ప్రాపర్టీ బుక్ చేశాడట! -
రూ.కోట్లు మింగిన నాగ‘మణి’
ఎమ్మిగనూరులో ఘరానా మోసం తేలు కుట్టిన దొంగల్లా బాధితులు ఎమ్మిగనూరు: నాగుపాములు, నాగమణుల సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమాలన్నీ విజ యాలు సాధించినవే. అదే సూత్రంతో ఓ ఇద్దరు ఎమ్మిగనూరులో పలు వ్యాపారులకు వెర్రెక్కించారు. నాగమణి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేశారు. అసలు ఉందో లేదో తెలియని మణి కోసం ఇళ్లు, వాకిలి తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, మరో స్వీటు వ్యాపారి కలసి నాగ‘మణి’ పేరిట జనాలను బుట్టలో వేశారు. రూ.కోట్లు విలువ చేసే మణి కర్ణాటకలోని ఓ బ్యాంకు లాకర్లో ఉందని, మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే లాకర్‌ను తెరువగలడని జోరుగా ప్రచారం చేశారు. మణితో తమ దశ తిరుగుతుందన్న అత్యాశతో కొందరు రూ.రెండు కోట్ల నుంచి లక్షల్లో వారికి ముట్టజెప్పారు. మొత్తం రూ.8 కోట్లు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని మలేసియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని, తొందర్లోనే మణి వస్తుందని ఆరునెలలుగా నమ్మబలుకుతున్నారు. వీరికి డబ్బులిచ్చి మోసపోయిన వ్యక్తి సోదరులు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకుని అగ్రహారం ఏజెంట్‌ను ప్రశ్నించగా., జూలై 15 లోగా రూ.50 లక్షలు తిరిగిచ్చేస్తామని, ఈ వ్యవహారం బయటకు పొక్కనివ్వొద్దంటూ వేడుకున్నట్టు తెలిసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు మలేిసియా వెళ్లి వచ్చినట్టు సమాచారం. మణి పేరిట వసూలు చేసిన మొత్తం ఏం చేశారో.? డబ్బు తిరిగి ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మణి మాయలో వీరికి డబ్బులు సమర్పించిన బాధితులు.., బయటకు చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.