కరీనా క్యా డీల్! | Kareena Kapoor has a new sweet fix | Sakshi
Sakshi News home page

కరీనా క్యా డీల్!

Published Sun, Mar 1 2015 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

కరీనా క్యా డీల్!

కరీనా క్యా డీల్!

బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్ ఒక సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలియదు గానీ... ఆమె ప్రాపర్టీకి మాత్రం మాంచి గిరాకీ తగిలింది. ముంబైలోని తన 2050 ఎస్‌ఎఫ్‌టీ బిగ్ ఫ్లాట్‌ను దాదాపు పదిహేను కోట్ల రూపాయలకు అమ్మిందట. వాస్తవానికి ఇవి రెండు ఫ్లాట్లు. ఒకటి కరీనాది. ఇంకోటి ఆమె తల్లిది. పక్కపక్కనే ఉన్న ఈ ఫ్లాట్స్‌ను కలిపేసి విశాలంగా మలుచుకున్నారు. రేటు భారీగా ఉండటం వల్ల మూడేళ్ల కిందటే అమ్మకానికి పెడితే... ఇప్పటికి వర్కవుటయింది.

సెలబ్రిటీ ట్యాగ్‌తోనే ధర అంతగా ఉందని, ఆ రేంజ్‌లో క్లయింట్‌ను వెతికి పట్టుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందని రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పాడు. ఇన్ని రోజులు వెయిట్ చేసినా అనుకున్న అమౌంట్ వచ్చినందుకు కరీనా ఖుషీగా ఉందట! ఈ అమ్మడే కాదు... బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ రీసెంట్‌గా 41.4 లక్షల రూపాయలకు ఓ ప్రాపర్టీ బుక్ చేశాడట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement