‘‘ఆ రోజు నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి నటించటం కోసం ఎంతగా ఎదురు చూడాల్సి వచ్చిందో! మేకప్ వేసుకున్న 16 గంటల తర్వాత కెమెరా ముందుకు వెళ్లాను. అప్పుడు టైమ్ ఉదయం నాలుగు గంటలైంది’’ అన్నారు కరీనా కపూర్. హీరోయిన్‌గా కరీనా పరిచయమైన ‘రెఫ్యూజీ’ విడుదలై 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా కరీనా చెప్పిన విశేషాలు.
♦రాజ్‌కపూర్ మనవరాలిగా, కరిష్మా కపూర్ చెల్లెలిగా సినిమా పరిశ్రమలోకి వచ్చాను. వారసురాలిగా వచ్చినా నాకు నేనుగా ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకున్నాను నా టాలెంట్‌తోనే 20 ఏళ్ల కెరీర్‌ను లాక్కొచ్చాను. నా 20వ ఏట నేను నటించిన మొదటి సినిమా ‘రెఫ్యూజీ’ విడుదలైంది (జూన్ 30). అప్పుడే ఇరవై ఏళ్లయిందంటే నమ్మలేకపోతున్నాను. దాదాపు 60కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించాను. అందులో ఎన్నో జయాపజయాలు, గొప్ప అనుభూతులను మిగిల్చిన సినిమాలు ఉన్నాయి.
♦వాస్తవానికి హృతిక్ రోషన్ మొదటి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో నేను హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. అయితే ‘రెఫ్యూజీ’ ద్వారా తెరపైకి వచ్చాను. హీరోగా అభిషేక్ బచ్చన్‌కి కూడా అది మొదటి సినిమా. ‘కహో నా ప్యార్ హై’ పెద్ద విజయం సాధించిఉండవచ్చు, ‘రెఫ్యూజీ’ అంతగా విజయం సాధించకపోవచ్చు. కానీ. ఇప్పటికీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటున్నాను.
♦ఇక ‘రెఫ్యూజీ’కి సంబంధించిన మీడియా సమావేశాలకు వెళ్లినప్పుడు, సినిమా ప్రమోషన్లలో పాల్గొనేటప్పుడు కాళ్లకు కూడా చెమటలు పట్టేది. నేను, అభి (అభిషేక్) అంత నెర్వస్‌గా ఫీలయ్యేవాళ్లం. ‘కహో నా ప్యార్‌హై’ సినిమాని మిస్సయినా తర్వాత నేను, హృతిక్ కలిసి 4 సినిమాల్లో నటించాం. నేను నంబర్ గేమ్ ట్రాప్‌లో పడను. ఐదారేళ్లే ఆ నంబర్ గేమ్‌లో ఉంటాం. ఇప్పుడున్న క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనే నేను ఫీలవుతాను. అందుకే ఈ కాంపిటీషన్ ఉచ్చులో నేనెప్పుడూ పడలేదు.
ప్రతిభతోనే నిలదొక్కుకున్నా: కరీనా
Published Thu, Jul 2 2020 12:46 PM | Last Updated on Thu, Jul 2 2020 12:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment