దొడ్డబళ్లాపురం(బెంగళూరు): లేనిదాని కోసం అత్యాశకు పోతే చేతిలో ఉన్నది పోయినట్లు ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ తనకు కమీషన్ కింద ఇచ్చిన చెక్కును ఎక్కువ మొత్తం దిద్ది కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... అంజినప్ప అనే వ్యక్తి దొడ్డ తాలూకాలో రెండెకరాల భూమిని చంద్రశేఖర్ అనే ఏజెంట్ సహాయంతో కొనుగోలు లావాదేవీలు నిర్వహించాడు.
ఇందుకుగాను ఆయన ఏజెంట్ చంద్రశేఖర్‌కు రూ.10 లక్షల కమీషన్‌ను ఐదేసి లక్షలు చొప్పున 2 చెక్కులు ఇచ్చాడు. ఒకసారి రూ.5 లక్షలు డ్రాచేసుకున్న చంద్రశేఖర్ రెండో చెక్ విషయంలో దురాశ పడ్డాడు. రూ.5 లక్షలకు ముందు 6 చేర్చి రూ.65 లక్షలుగా దిద్ది బ్యాంకులో చెక్కును ఇచ్చాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అంజినప్పకు ఫోన్ చేసి విచారించగా, తాను ఇచ్చింది రూ.5 లక్షల చెక్ మాత్రమేనని చెప్పాడు. దీంతో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు.
చదవండి హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి?
Comments
Please login to add a commentAdd a comment