
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో భారత్‌లో తొలి అగ్రిగేటర్ అయిన స్టీల్ ఆన్ కాల్ సర్వీసెస్ తన కస్టమర్లకు త్వరితగతిన సరుకు చేర్చేందుకు భారీ గిడ్డంగులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్, వైజాగ్, అమరావతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో ఇవి రానున్నాయి. వీటి కోసం రూ.150–200 కోట్లు ఖర్చు చేస్తామని స్టీల్ ఆన్ కాల్ సీఎండీ ఎ.రవికుమార్ తెలిపారు. సీఈవో లక్ష్మి, సీఎంవో ఈశ్వరయ్యతో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
2016 ఏప్రిల్‌లో కంపెనీ ప్రారంభం అయిందని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. లైవ్ ప్రైస్ ద్వారా కస్టమర్లకు 20 బ్రాండ్ల స్టీల్ విక్రయిస్తున్నామని తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక టన్నుపై వినియోగదార్లకు రవాణా, ఇతర ఖర్చులు రూ.2,500 దాకా ఆదా అవుతుందని వెల్లడించారు. ఇందుకు కనీసం ఒక టన్ను ఆర్డరు చేయాల్సి ఉంటుందన్నారు. 2017–18లో కంపెనీ రూ.76 కోట్ల టర్నోవర్ సాధించింది.