
హైదరాబాద్: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ఆధునాతన సాంకేతికత సాయంతో తుప్పు నిరోధక, బలీయమైన ఉక్కు ఉత్పాదనకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి ఎంఎస్ లైఫ్ 600+ సీఆర్‌ఎస్ (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది.
అలాగే రాబోయే 3–4 సంవత్సరాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది.
రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 18–20 నెలల్లో దేశవ్యాప్తంగా 1,000+ యాక్టివ్ డీలర్లకు విస్తరించనున్నారు. విస్తరణ ద్వారా 5,000+ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది.