CRS
-
అఫ్గాన్‌లో పాకిస్తాన్ విధ్వంసకర పాత్ర
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పొరుగు దేశం పాకిస్తాన్ చాలా ఏళ్లుగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు అమెరికాలో కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) తన నివేదికలో వెల్లడించింది. స్వతంత్ర విషయ నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. అఫ్గాన్‌లో పాక్ విధ్వంసకర, అస్థిరతకు కారణమయ్యే పాత్ర పోషిస్తున్నట్లు సీఆర్ఎస్ రిపోర్టు తేల్చిచెప్పింది. తాలిబన్ ముష్కరులకు పాక్ పాలకుల అండదండలు బహిరంగ రహస్యమేనని పేర్కొంది. పాకిస్తాన్, రష్యా, చైనా, ఖతార్ వంటి దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి, సంబంధాలు పెంచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే అమెరికా ఒంటరి కాక తప్పదని పేర్కొంది. అఫ్గాన్‌పై అమెరికా పట్టు సడలిపోతుందని పేర్కొంది. ఫలితంగా తాలిబన్ పాలకులు అమెరికా ఒత్తిళ్లను ఎదిరించే పరిస్థితి ఉత్నన్నమవుతుందని సీఆర్ఎస్ రిపోర్టు వివరించింది. ‘‘అఫ్గాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని కొందరు పాక్ విజయంగా భావిస్తున్నారు. దీంత్లో అక్కడ పాక్ పెత్తనం పెరిగిపోతుంది. అఫ్గాన్‌పై భారత్ ప్రభావాన్ని తగ్గించాలన్న పాక్ యత్నాలు తీవ్రమవుతాయి’’ అని పేర్కొంది. ఢిల్లీ సదస్సును స్వాగతించిన తాలిబన్ కాబూల్: అఫ్గానిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్’ను తాలిబన్ ప్రభుత్వం స్వాగతించింది. భారత్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో మొత్తం 8 దేశాలు పాల్గొన్న విషయం తెలిసిందే. సదస్సు నేపథ్యంలో భారత్ చేసిన డిమాండ్లన్నిటినీ తాము నెరవేర్చామని తాలిబన్ ప్రభుత్వం తెలిపిందని టోలో వార్తా సంస్థ తెలిపింది. ‘ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబన్) భారత్ సదస్సును స్వాగతిస్తోంది. పాలన విషయంలో గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అఫ్గాన్ భూభాగాన్ని తమకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని ఏ ఒక్క దేశం కూడా ఆందోళన చెందవద్దు’అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇనాముల్లా సమాంగని తెలిపారని టోలో న్యూస్ పేర్కొంది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేయడంలో ఢిల్లీ భేటీ అసాధారణ చొరవ చూపిందని పేర్కొంది. ‘అఫ్గానిస్తాన్‌కు సాయం అందిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్.. ఢిల్లీ సదస్సును ప్రభావవంతంగా నిర్వహించిందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు సయద్ హకీమ్ కమాల్ చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. -
హెచ్–4 వీసాల్లో 93% భారతీయులకే
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 (స్పౌస్) వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికన్ సంస్థ సీఆర్ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో ఐదో వంతు కంటే ఎక్కువ (28,033) మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని, టెక్సాస్, న్యూజెర్సీల్లో మరో 20 శాతం మంది పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఈ హెచ్–4 వీసాలు మంజూరు చేస్తారు. మొత్తంగా అమెరికా మంజూరు చేసిన హెచ్–4 వీసాల్లో 93 శాతం మహిళలకు.. ఏడు శాతం పురుషులకు ఇచ్చారు. అమెరికన్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ హెచ్–4 వీసాలపై తాజాగా 9 పేజీల నివేదిక విడుదల చేసింది. హెచ్–4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారతీయులకు, 5 శాతం చైనీయులకు, ఇతర దేశాలకు చెందిన వారికి రెండు శాతం వీసాలిచ్చినట్టు తెలిపింది. 2017, డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్–4 వీసాదారుల దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆమోదించింది. -
ఎర్రగుంట్ల.. నంద్యాల రైలు నడిచేనా!
♦ రేపు జిల్లాకు రానున్న సీఆర్ఎస్ ♦ సీఆర్ఎస్ ఓకే అంటే రైలు కూత మొదలు ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వరకు రైలు మార్గం పూర్తయింది. ఇక సీఆర్ఎస్( కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ) పరిశీలించి ఓకే అంటే ఈ మార్గంలో రైళ్లను నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఆర్ఎస్ ఈ నెల 20వ తేదిన ఎర్రగుంట్ల- నంద్యాల రైల్వే ట్రాక్ పరిశీలనకు రానున్నట్లు తెలిసింది. ఈ రైలు మార్గాన్ని ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రగుంట్ల- నంద్యాల మార్గంలో కొత్త బ్రాడ్ గేజ్ లైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.950 కోట్లు ఖర్చు చేయునుంది. ఈ లైన్ మధ్య ఎనిమిది రైల్వే స్టేషన్లు వస్తాయి. ఎర్రగుంట్ల నుంచి మొదలుపెడితే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు వస్తాయి. ఇప్పటికే ఆయా స్టేషన్లకు సంబంధిత సిబ్బందిని గతంలోనే నియమించారు. ఈ రైల్వేలైన్ మధ్య ప్రధాన వంతెనలు 4, మేజర్ వంతెనలు 27, చిన్న వంతెనలు 436 దాకా ఉన్నాయి. సాధించిన ప్రగతి.. ఈ లైన్ మొత్తం 123 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే ఇందులో ఎర్రగుంట్ల-నొస్సంల మధ్య 48 కిలోమీటర్లు పూర్తయింది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక నొస్సం- బనగానపల్లె మధ్య 45 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గం పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బనగానపల్లె- నంద్యాల మధ్య సుమారు 30 కిలో మీటర్ల దాకా నిర్మాణంలో ఉంది. ఈ లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైల్వే లైన్ వల్ల లాభాలు .. ఈ రైలు మార్గం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని కర్నూలు, కడప జిల్లాలతో అనుసంధానం చేయనుంది. అంతేకాక జిల్లాలో పుణ్యక్షేత్రాలయిన దేవుని కడప, కడప పెద్ద దర్గా, ప్రొద్దుటూ రు శ్రీ కన్యాక పరమేశ్వరీ ఆలయం, గండికోట తదితర దర్శనీయ ప్రదేశాలు దేశానికి పరిచయమవుతాయి. ఇంకా చెప్పాలంటే ఎర్రగుంట్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, సంజామల ప్రాంతాలలో సిమెంట్ పరిశ్రమల వృద్ధితో పాటు రవాణా సౌకర్యం, ఉపాధి కలుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే లైన్లో త్వరగా రైలు నడిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాని ప్రజలు కోరుతున్నారు.