కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవితల్లోని ఆత్మను వెలికితీసేలా ఆయన జీవితంపై సమగ్ర పరిశోధన జరగాలని సినీ రచయిత...
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవితల్లోని ఆత్మను వెలికితీసేలా ఆయన జీవితంపై సమగ్ర పరిశోధన జరగాలని సినీ రచయిత, చిత్రకారుడు, కాళోజీ శతజయం తి ఉత్సవ కమిటీ చైర్మన్ బి.నర్సింగరా వు అన్నారు. ప్రజాకవి కాళోజీ శతజయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియం లో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాళోజీ చరిత్రాత్మక జీవితం గలవాడని ఆయన ‘నా గొడవ’లోని కవితలను ఎన్నిసార్లు చది వినా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుందన్నా రు.
కాళోజీని ప్రపంచానికి పరిచయం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాళోజీ ఫౌండేషన్‌తో పాటు ఇతర సంస్థ ల సహకారంతో ప్రణాళికలు చేపట్టామ ని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ప్రతినెలా కాళోజీ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ పుస్తకావిష్కరణ చేస్తున్నారని వివరించారు. విశ్రాంతాచార్యులు కొవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ కాళోజీ కటువుగా కన్పించినా మనసు మెత్తనిదని, ఎంతో మందిని అక్కున చేర్చుకున్నారని అన్నారు.
కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నర్సింగరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాళోజీ కవిత్వంలో సూటిదనం, నిండుదనం, స్పష్టత ఉంటుందన్నారు. కేయూ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య మాట్లాడుతూ కాళోజీని పాల్కూరికి సోమనాథుడు, గురజాడ, వేమనతో పోల్చవచ్చన్నారు. నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ పోతన విజ్ఞానపీఠంలో కాళోజీ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఆత్మీయ అతిథులుగా కాళోజీ కుమారుడు రవికుమార్, కోవెల సంతోష్ మాట్లాడారు.
అలరించిన బహుభాషా సమ్మేళనం
భోజనవిరామం తర్వాత ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షతన జరిగిన బహుభాషా కవుల కవితాపఠనం అలరించింది. ఈ సందర్భంగా వీఆర్ విద్యార్థి మాట్లాడుతూ కాళోజీ ప్రపంచ కవులకు స్ఫూర్తి దాత అని చాటి చెప్పడానికే బహుభాషా కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా రామాచంద్రమౌళి, గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, తాజ్‌ముష్తర్, అజీజ్ ఉర్సితోపాటు ఉర్దూ కవులు జనాబ్ మసూద్ మీర్జామహషర్, వహీద్ గుల్షన్, హిందీ కవి జగదీశ్ చంద్రసితార్, ఆంగ్ల కవులు ఫహిమ్ జావేద్, మెట్టు రవీందర్, వి.రంగాచార్య, వరిగొండ కాంతారావు, బండారు ఉమామహేశ్వర్‌రావు, అన్వర్, వి.వీరాచారి, వడ్డెబోయిన శ్రీనివాస్, ఎంఏ.బాసిత్, వల్సపైడి, నల్లెల రాజయ్య, ఎండీ.సిరాజుద్దీన్, శనిగరపు రాజ్‌మోహన్, శ్రవణ్‌కుమార్ రక్తాని, ఆడెపు చంద్రమౌళి, కొవెల శ్రీలత తదితర 40 మంది కవులు తమ కవితలు వినిపించారు.
అన్వర్‌తో పాటు వడ్డెబోయిన శ్రీనివాస్ చదివిన కవితలు ప్రత్యేకంగా నిలిచారుు. కార్యక్రమంలో విశ్రాంతాచార్యులు ఎస్.లక్ష్మణమూర్తి, వి.విశ్వనాథరావు, పోట్లపల్లి ధరణిశ్వర్‌రావు, కె.కృష్ణమూర్తి, పోతన పీఠం మేనేజర్ జేఎన్.శర్మ తదితరులు పాల్గొన్నారు.