విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!
విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!
Published Wed, Dec 11 2013 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
పలాస, న్యూస్‌లైన్: విద్యుత్ అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఆకస్మిక దాడులు చేసి, హడలెత్తించారు. పలాస- కాశీబుగ్గ పట్టణాలతో పాటు..పలాస మండలం బ్రా హ్మణతర్లాలో అధికారులు దాడులు జరిపి, విద్యుత్ మీ టర్లను పరిశీలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 26 మందిపై కేసులు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి..అదనపు విద్యుత్‌ను వాడినందుకు అ దనపు చార్జీలతో పాటు అపరాధ రుసుం వసూలు చేస్తామని టెక్కలి డీఈ రవికుమార్ చెప్పారు. ఆయన పర్యవేక్షణలో టెక్కలి డివిజన్‌లోని మొత్తం 16మంది ఏఈ లతో పాటు టెక్కలి ఏడీఈ రామకృష్ణ, సోంపేట ఏడీ ఈ పాత్రుడు, నరసన్నపేట ఏడీఈ ఈశ్వరరావు, పలాస ఏఈ మధు దా డుల్లో పాల్గొన్నారు. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈ త నిఖీలు చేపట్టారు. కేటగిరీ -2 మీటర్లు పరిశీలించారు. పలాస కాశీబుగ్గ పట్టణంలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నందున..వాటికి మీటర్లు అమర్చకుండా..మీటర్లు ఉన్నా..సక్రమంగా వినియోగించకుండా..విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని డీఈ చెప్పారు. చౌర్యానికి పాల్పడినా..మీటర్లను సక్రమం గా వినియోగించకున్నా..చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Advertisement