ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్.. సిన్సినాటి, ఒహియోకు చెందిన ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ER&D) సర్వీస్ ప్రొవైడర్ 'బెల్‌కాన్'ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
కాగ్నిజెంట్ కంపెనీ ఇప్పుడు బెల్‌కాన్‌ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 10800 కోట్లు. కాగ్నిజెంట్ ఈ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత తన పరిధిని మరింత విస్తరించనుంది.
ఇక బెల్‌కాన్ విషయానికి వస్తే.. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 కంటే ఎక్కువ దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో ఏకంగా 10000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, బోయింగ్, అమెరికా నేవీ, నాసా వంటి సంస్థలకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. కంపెనీ విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటనను బెల్‌కాన్ అధికారికంగా ప్రకటించలేదు.
ఒప్పందంలో భాగంగా, బెల్‌కాన్ సీఈఓ లాన్స్ క్వానీవ్‌స్కీ నేతృత్వంలో కంపెనీ కొనసాగుతుందని, కాగ్నిజెంట్ యూనిట్‌గా పనిచేస్తుందని కాగ్నిజెంట్ తెలిపింది. బెల్‌కాన్ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 66 వేలకోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ కొనుగోలుతో కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Cognizant has agreed to acquire Belcan, expanding access to the high-growth Engineering Research & Development services market and establishing leadership in aerospace & defense. See the release here: https://t.co/2HS9UKKR5V pic.twitter.com/XoZqEHelEr
— Cognizant (@Cognizant) June 10, 2024
Comments
Please login to add a commentAdd a comment