ఒత్తిళ్లకు తలొగ్గిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్
ఒత్తిళ్లకు తలొగ్గిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్
Published Wed, Feb 8 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
బెంగళూరు : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకుంది. తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియట్ మేనేజ్మెంట్ ఒత్తిళ్లకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకునేందుకు సమ్మతించింది. అంతేకాక ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్ల(రూ.22831కోట్లు)ను రిటర్న్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. నవంబర్లో ఇలియట్కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్హోల్డర్ విలువను పెంచడానికి ఈ ఐటీ సర్వీసు ప్రొవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుంచో వాదిస్తోంది.
ఈ మేరకు ఒత్తిళ్లకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్లలో షేర్హోల్డర్స్కు రూ. 22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్ను బుధవారం ఆమోదించింది. షేర్ల బై బ్యాక్, డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్కు కేటాయించనుంది. 2017-18 ఆర్థికసంవత్సరంలో తొలి క్వార్టర్లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, రెండో క్వార్టర్లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పునః కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
Advertisement
Advertisement