
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్ తెలిపింది. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం లక్ష మంది మహిళా ఉద్యోగులను 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 2019లోనే దాన్ని సాధించేసింది. పైగా వారిలో 75 శాతం భారత్ నుంచే పనిచేస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment