కాగ్నిజెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ | Cognizant to acquire Australian firm Adaptra for 'undisclosed sum' | Sakshi
Sakshi News home page

కాగ్నిజెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

Published Sat, Dec 17 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

కాగ్నిజెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

కాగ్నిజెంట్‌ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

చెన్నై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌... ఆస్త్రేలియాకు చెందిన కన్సల్టింగ్, బిజినెస్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సర్వీసులందించే అడప్‌ట్ర సంస్థను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు.  ఈకంపెనీ కొనుగోలుతో తమ బీమా వ్యాపార విభాగం మరింత శక్తివంతం కానున్నదని కాగ్నిజెంట్‌ వెల్లడించింది. కంపెనీ కొనుగోలులో భాగంగా అడప్‌ట్ర సంస్థకు చెందిన వంద మంది ఉద్యోగులు తమ సంస్థలో చేరతారని కాగ్నిజెంట్‌ హెడ్‌ (ఏషియా పసిఫిక్‌) జయజ్యోతి సేన్‌గుప్తా చెప్పారు.

కొత్త వృద్ధి అవకాశాలు..
కాగ్నిజెంట్‌ కొనుగోలుతో కొత్త వృద్ది అవకాశాలు అందిపుచ్చుకోగలమని అడప్‌ట్ర ఎండీ పీటర్‌ ఓవర్టన్‌ పేర్కొన్నారు. కాగ్ని జెంట్‌ అంతర్జాతీయ అనుభవం, విస్తృతమైన డిజిటల్‌ శక్తి సామర్థ్యాల కారణంగా తాముభవిష్యత్తులో మరింత మెరుగైన సేవలందించగలమని వివరించారు. కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వంద డెవలప్‌మెంట్‌ సెంటర్లున్నాయి. 2.25 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా సిడ్నికేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అడప్‌ట్ర 1998లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌  దేశాల్లో అగ్రస్థాయి 10 బీమా కంపెనీల్లో ఐదింటికి తన సేవలనందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement