ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. అమెరికాకు చెందిన 'కాగ్నిజెంట్' మాత్రం ఏకంగా భారతదేశంలోని ఆఫీసునే అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆఫీసును విక్రయిస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో సుమారు 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయంగా కలిగిన ఉన్న ఆఫీసును డిసెంబర్ నాటికి విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన బాధ్యతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ 'జేఎల్ఎల్'కు అప్పగించినట్లు చెబుతున్నారు.
కాగ్నిజెంట్ విక్రయించనున్న ఈ ఆఫీసు చెన్నైలోని ఐటీ కారిడార్‌లో ఉంది. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిని కొనుగోలు చేయడానికి భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఆ రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
ఇదీ చదవండి: 30 నెలలు వెయింట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్
2024 డిసెంబర్ నాటికి ఆఫీసును విక్రయించి.. చెన్నైలోని జీఎస్‌టీ రోడ్డులోని తాంబరం సమీపంలో కొత్త హెడ్ ఆఫీసు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బహుశా ఉద్యోగులంతా ఆ కొత్త ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నాము. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో.. కంపెనీ తన పాత భవనాన్ని విక్రయించడానికి సన్నద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment