కాగ్నిజంట్ లాభం 17 శాతం అప్
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కాగ్నిజంట్ నికర లాభం గత ఏడాది నాలుగో త్రైమాసిక కాలంలో 17 శాతం వృద్ధి చెందింది. 2014 క్యూ4లో 36 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో 42 కోట్ల డాలర్లకు చేరిందని కాగ్నిజంట్ తెలిపింది. ఆదాయం 274 కోట్ల డాలర్ల నుంచి 18 శాతం వృద్ధితో 323 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొంది. క్యూ4కు అంచనా వేసిన ఆదాయాన్ని సాధించామని వివరించింది.
గత ఏడాది మొత్తానికి నికర లాభం 13 శాతం వృద్ధితో 162 కోట్ల డాలర్లకు, ఆదాయం 21 శాతం వృద్ధితో 1,242 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది గెడైన్స్‌ను తగ్గించింది. ఈ ఏడాది ఆదాయం 10-14% వృద్ధితో 1,365 కోట్ల డాలర్ల నుంచి 1,420 కోట్ల డాలర్లకు పెరుగతాయని కాగ్నిజంట్ అంచనా వేస్తోంది. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. గతేడాది క్యూ4లో 2,400 మందిని నియమించామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,700కు చేరిందని వివరించారు,