కాగ్నిజంట్ లాభం 44 కోట్ల డాలర్లు
ఈ ఏడాది ఆదాయ అంచనాలను తగ్గించిన కంపెనీ
న్యూయార్క్: ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజంట్ నికర లాభం ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో 15 శాతం పెరిగింది. గత ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 38 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఇదే కాలానికి 44 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజంట్ పేర్కొంది. ఆదాయం 291 కోట్ల డాలర్ల నుంచి 10 శాతం వృద్ధితో 320 కోట్ల డాలర్లకు ఎగసిందని కాగ్నిజంట్ సీఎఫ్‌ఓ కరెన్ మెక్‌లాగిన్ చెప్పారు. ఆదాయం తమ అంచనాలకనుగుణంగానే పెరిగిం దని పేర్కొన్నారు.
అయితే ఆదాయం అంతకు ముందటి క్వార్టర్ (2015 ఏడాది క్యూ4)తో పోల్చితే 0.9% తగ్గిందని వివరించారు. ఈ ఏడాది మొదటి క్వార్టర్ ఫలితాలను బట్టి ఈ ఏడాది ఆదాయ అంచనాలను తగ్గిస్తున్నామని కరెన్ పేర్కొన్నారు. గతంలో 1,365-1,420 కోట్ల డాల ర్లుగా ఉన్న ఆదాయ అంచనాలను 1,365-1,400 కోట్ల డాలర్లకు తగ్గిస్తున్నామని వివరిం చారు. అంచనాలకనుగుణంగానే మొదటి క్వార్టర్ ఫలితాలున్నాయని కాగ్నిజంట్ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా వివరించారు.