న్యూఢిల్లీ: అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 49.5 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం 44.4 కోట్ల డాలర్లతో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ తెలియజేసింది. ఆదాయం 9 శాతం వృద్ధితో 377 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా తెలిపారు. గతంలో తాము పేర్కొన్న 373– 378 కోట్ల డాలర్ల ఆదాయ అంచనాలను అందుకున్నామని తెలియజేవారు.
ఈ జోష్‌తో పూర్తి సంవత్సరం ఆదాయ అంచనాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 9–10 శాతం రేంజ్‌లో ఉన్న ఆదాయ అంచనాలను 9.5–10 శాతానికి (1,478–1,484 కోట్ల డాలర్లు) పెంచుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది నాలుగో క్వార్టర్‌కు 379–385 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ కంపెనీకి భారత్‌లోనే అధికంగా ఉద్యోగులున్నారు.
11% పెరిగిన కాగ్నిజెంట్ లాభం
Published Thu, Nov 2 2017 12:14 AM | Last Updated on Thu, Nov 2 2017 12:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment