Return to office not mandatory: వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు నానా అవస్థలు పడుతుంటే తమ ఉద్యోగులు ఆఫీస్‌కు రావడం తప్పనిసరి కాదు అంటోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో రవి కుమార్ స్వయంగా తెలిపారు.
"ఉద్యోగుల్లో ఫ్రెషర్లు కూడా ఉన్న నేపథ్యంలో సమూహంగా పనిచేయడం అవసరమని మేము భావిస్తున్నాం. వారికి వారిని చేయి పట్టి నడిపించడం అవసరం. కానీ మేనేజర్‌లు, సీనియర్ ఉద్యోగులు ఆఫీస్‌కి రాకపోయినా ఎటువంటి ప్రభావం ఉండదు" అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తాజా ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి తమ ఫ్లెక్సిబుల్ రిటర్న్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఐటీ సేవల సంస్థలలో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించేందుకు అత్యంత దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఓ పెట్టుబడిదారుల సదస్సులో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ, పెద్ద నగరాల్లో 80,000 సీట్లను తగ్గించి, టైర్-2 నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్‌ఫోర్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్‌లను పెంచడానికి 400 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Google Back To Office Offer: గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్‌కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ!
Comments
Please login to add a commentAdd a comment