not mandatory
-
ఆఫీస్‌కు రావడం తప్పనిసరి కాదు.. భిన్నంగా ఆ ఐటీ కంపెనీ తీరు
Return to office not mandatory: వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు నానా అవస్థలు పడుతుంటే తమ ఉద్యోగులు ఆఫీస్‌కు రావడం తప్పనిసరి కాదు అంటోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో రవి కుమార్ స్వయంగా తెలిపారు. "ఉద్యోగుల్లో ఫ్రెషర్లు కూడా ఉన్న నేపథ్యంలో సమూహంగా పనిచేయడం అవసరమని మేము భావిస్తున్నాం. వారికి వారిని చేయి పట్టి నడిపించడం అవసరం. కానీ మేనేజర్లు, సీనియర్ ఉద్యోగులు ఆఫీస్‌కి రాకపోయినా ఎటువంటి ప్రభావం ఉండదు" అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తాజా ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి తమ ఫ్లెక్సిబుల్ రిటర్న్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఐటీ సేవల సంస్థలలో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించేందుకు అత్యంత దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఓ పెట్టుబడిదారుల సదస్సులో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ, పెద్ద నగరాల్లో 80,000 సీట్లను తగ్గించి, టైర్-2 నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్‌ఫోర్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్లను పెంచడానికి 400 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. Google Back To Office Offer: గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్‌కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ! -
‘చార్ధామ్’కు కోవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
డెహ్రాడూన్: ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యే చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు/ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు, సరిహద్దుల వద్ద వారు వేచి చూడాల్సిన అవసరం లేకుండా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు /వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నిబంధనను ప్రస్తుతానికి తొలగించినట్లు వివరించింది. పర్యాటక శాఖ పోర్టల్‌లో యాత్రికుల సంఖ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ: సుప్రీకోర్టు ఆధార్ విషయంలో మరోసారి కేంద్రానికి ఝలక్ ఇచ్చింది. పాన్‌కార్డ్‌తో ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్ నెంబర్ అనుసంధానం మాండేటరీ కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) తో ఆధార్ సంఖ్యను అనుసంధానిస్తూ ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా చేర్చిన నిబంధనను సుప్రీం సమర్థించింది. అయితే ఈ విషయంలో ప్రజలను బలవంతం చేయడం తగదని సూచించింది. ఆధార్-పాన్ లింకేజ్ స్వచ్ఛందంగా ఉండాలనే వాదనను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే ఆధార్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దు చేసే ఆలోచనను సుప్రీం తప్పుపట్టింది. ఇది తీవ్ర పరిణామాలను దారి తీస్తుందని హెచ్చరించింది. మే 4 వ తేదీన జస్టిస్ ఎకె సిక్రి, అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం తాజా బడ్జెట్, ఆర్థిక చట్టం, 2017 ద్వారా ప్రవేశపెట్టిన ఇన్ కం టాక్స్ (ఐ-టి) చట్టం 139ఏఏ సెక్షన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనను నేటికి వాయిదా వేసింది. ఆధార్ లేకపోయినా కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ కు కేంద్రం ఆధార్ నంబర్ ను తప్పనిసరి చేసింది. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది. అయితే దీనిపై వ్యతిరేకతలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
సర్వీస్ చార్జ్‌పై క్లారిటీ..గైడ్‌లైన్స్ జారీ
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్ల విధిగా సర్వీస్ చార్జి చెల్లించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తద్వారా సర్వీసు బాదుడుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ఇక మీదటహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసే సర్వస్ చార్జ్ తప్పనిసరికాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గైడలైన్స్ ను కేంద్రప్రభుత్వం రూపొందించింది. కస్టమర్ల నుంచి వసూల్ చేసే సర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం నియమావళిని విడుదల చేసింది. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి అంశం కాదని, అది వ్యక్తగతమైనదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్లో ప్రకటించారు. సర్వీస్ చార్జ్ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్‌కు, రెస్టారెంట్లకు లేదని ట్వీట్ చేశారు. కస్టమర్లు ఎంత సర్వీస్ ఛార్జ్ కట్టాలన్న అంశాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు డిసైడ్ చేయరాదని, అది కస్టమర్ విజ్ఞతకు వదిలి వేయాలని వరుస ట్వీట్లలో తెలిపారు.. సర్వీస్ ఛార్జ్ అంశంపై తయారు చేసిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు పాశ్వాన్ పేర్కొన్నారు. కాగా సేవా రుసుంను తప్పనిసరిగా బిల్లుతో పాటు చేర్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. దీనికి హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లుతోపాటు వాటి స్థాయిని బట్టి 5-20 శాతం సర్వీస్ చార్జి బిల్లులో కలిపి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. Hotels/Restaurants should not decide how much Service Charge is to be paid by the customer &it should be left to the discretion of customer. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 Guidelines are being sent to states for necessary action at their ends. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 -
అన్నింటికి ఆధార్ తప్పని సరికాదు