
కాగ్నిజెంట్ చేతికి జపాన్ సంస్థ
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ జపాన్ సంస్థను విలీనం చేసుకుంది.
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ జపాన్ సంస్థను విలీనం చేసుకుంది. జపనీస్ కంపెనీ బ్రిలియంట్ సర్వీసెస్ ను కొనుగోలు చేసినట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది. ఈ విలీనంలో భాగంగా బ్రిలియంట్‌కు చెందిన డిజిటల్ సొల్యూషన్స్‌లో అపార అనుభవమున్న 70మంది నిపుణుల బృందం కాగ్నిజెంట్లో చేరుతున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కొనుగోలు మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు.
2004 లో స్థాపించబడిన బ్రిలియంట్ ఒసాకా ప్రధానకేంద్రంగా తన సేవలను అందిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రాటజీ, ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ (థింగ్స్ ఇంటర్నెట్) ప్రత్యేకతలను కలిగి ఉంది. జపాన్ లోని ప్రధాన సంస్థలకు ఎండ్ టు ఎండ్ ఆండ్రాయిడ్ /ఐఓఎస్ అప్లికేషన్లు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, వినియోగదారుకు అనుభవ రూపకల్పన మరియు ఆన్లైన్ టు ఆఫ్ లైన్ సేవలను అందిస్తుంది.
కస్టమర్లు, టెక్నాలజీ డిమాండ్లకనుగుణంగా మరిన్న స్మార్ట్ సేవలను, ఉత్పత్తులను రూపొందించనున్నామని కాగ్నిజెంట్ ఆసియా-పసిఫిక్ హెడ్ జయజ్యోతి సేన్ గుప్తా చెప్పారు.ఈ విలీనంతో తమ సామర్థ్యాలను మరింత విస్తరించుకోని, వినియోగదారులు మెరుగైన సేవలను అందించనున్నామని బ్రిలియంట్ సీఈవో యోషిహికో సుగిమోటో తెలిపారు.
కాగా జపాన్ లో కాగ్నిజెంట్ టోక్యో, ఒసాకాల్లో రెండు కార్యాలయాలతో సుమారు 400 మంది సిబ్బందితో ఐటీ సేవలను అందిస్తోంది. అయితే జపాన్ మార్కెట్ లో భారతీయ కంపెనీల 2 శాతం కస్టమర్లు, టెక్నాలజీ డిమాండ్లకనుగుణంగా మరిన్న స్మార్ట్ సేవలను, ఉత్పత్తులను రూపొందించనున్నామని కాగ్నిజెంట్ ఆసియా-పసిఫిక్ హెడ్ జయజ్యోతి సేన్ గుప్తా చెప్పారు. ఆదాయంతో పోలిస్తే కాగ్నిజెంట్ ఆదాయం తక్కువే.