Cognizant appoints six women svps: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యనిర్వాహక బృం దంలో ఏకంగా ఆరుగురు మహిళల్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో మహిళలకు చోటు దక్కడం లేదడం లేదన్న ఆందోళన క్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఆరుగురు మహిళలను నియమించినట్లు జూలై 19న తెలిపింది. (న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ)
వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరిగా కొత్తగా నియమించుకుంది.తద్వారా బలమైన, విభిన్నమైన సంస్థను నిర్మించడం కొనసాగిస్తోందనే ప్రశంసలు వెల్లు వెత్తాయి. 2023లో జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియామకం తరువాత జరిగిన ఈ పరిణామం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. మూడు కీలకమైన ఆవశ్యకాలపై దృష్టి సారించడంతో పాటు, నాయకత్వ స్థానాలతో సహా కాగ్నిజెంట్, విభిన్న ప్రతిభను పెంచడం తన ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటి సీఈవో ప్రకటించారు ఈ సందర్భాన్ని సమిష్టిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని పేర్కొన్న రవికుమార్. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సిస్టమేటిగ్గా ఉండాలి. మహిళా నిపుణులను రిక్రూట్ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, నిమగ్నం చేయడం, నిలుపుకోవడం వంటి వాటితో తాము మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!)
శైలజా జోస్యుల
కీలక స్థానాల్లో ఆరుగురు మహిళలు
♦ హైదరాబాద్‌లోని కంపెనీ సెంటర్ హెడ్ శైలజా జోస్యుల ఎస్‌వీపీగా ప్రమోషన్ లభించింది. 2018లో కాగ్నిజెంట్‌లో చేరిన శైలజా ఇప్పుడు ఉత్తర అమెరికాలోని వాణిజ్య మార్కెట్‌లతో పాటు గ్లోబల్ డెలివరీ కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) పరిశ్రమకు SVP, ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ (IOA)గా ఉన్నారు. చెన్నై తర్వాత 56,000 మంది అసోసియేట్‌లతో కాగ్నిజెంట్‌కు హైదరాబాద్ రెండో అతిపెద్ద డెలివరీ కేంద్రం.
♦ 2021లో కాగ్నిజెంట్‌లో చేరిన ఎలిసా డి రోకా-సెర్రా, SVP, EMEA జనరల్ కౌన్సెల్ అండ్ కాంట్రాక్ట్ లైఫ్‌సైకిల్ రిస్క్ మేనేజ్‌మెంట్ (CLRM)గా పదోన్నతి పొందారు.
♦ 2020లో కాగ్నిజెంట్‌లో చేరిన థియా హేడెన్ ఇప్పుడు ఎస్‌వీపీ. గ్లోబల్ మార్కెటింగ్. కాగ్నిజెంట్ బ్రాండ్, డిజైన్ , సృజనాత్మక సేవలు, సోషల్ మీడియా, ఆలోచనా నాయకత్వం , రీసెర్చ్‌కుహేడెన్ బృందం బాధ్యత వహిస్తుంది.
♦ ప్యాట్రిసియా (ట్రిష్) హంటర్-డెన్నెహీ ఎస్‌వీపీ (హెల్త్‌కేర్ ప్రొవైడర్/పేయర్ బిజినెస్ యూనిట్)గా పదోన్నతి పొందారు. హెల్త్‌కేర్ డెలివరీతో సహా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ మొత్తం నిర్వహణకు ఆమె టీంమద్దతు ఇస్తుంది. ట్రైజెట్టో కొనుగోలులో భాగంగా ట్రిష్ 2015లో కాగ్నిజెంట్‌లో చేరారు.
♦ 2020లో కాగ్నిజెంట్‌కు రిజైన్ చేసిన అర్చన రమణకుమార్ జూలై 5న SVP, ఇండస్ట్రీ సొల్యూషన్స్ గ్రూప్ (ISG)గా తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు.
♦ సాండ్రా నటార్డోనాటో జూలై 17న కాగ్నిజెంట్‌లో పార్టనర్‌షిప్ అండ్ అలయన్స్ ఎస్‌వీపీగా చేరారు. కాగ్నిజెంట్‌కు ముందు, నటార్డొనాటో గార్ట్‌నర్‌తో 15 సంవత్సరాలు సీనియర్ ఈక్విటీ విశ్లేషకురాలిగా గా వివిధ వృత్తిపరమైన సేవల సంస్థలతో 11 సంవత్సరాల అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment