మైక్రోసాఫ్ట్‌లో సైబర్ దాడుల కలకలం రేపుతున్నాయి. రష‍్యాకు చెందిన హ్యాకర్లు తమ సంస్థపై సైబర్ దాడులు చేశారంటూ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారిక ప్రకటన చేసింది. జనవరి 12న రష్యా హ్యాకర్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ సిస్టమ్స్‌పై దాడులు చేసి ఈమెయిల్స్‌ను దొంగిలించారు. వాటి సాయంతో సిబ్బంది అకౌంట్‌లలోని పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
రష్యాలో సుపరిచితమైన హ్యాకింగ్ గ్రూప్స్ నోబెలియం, మిడ్‌నైట్ బ్లిజార్డ్ సభ్యులు నవంబర్ 2023 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థపై ‘పాస్‌వర్డ్ స్ప్రే అటాక్స్’ పాల్పడినట్లు తన బ్లాగ్‌లో పేర్కొంది. సంస్థకు చెందిన కంప్యూటర్లపై సైబర్ దాడులే లక్ష్యంగా ఒకే పాస్‌వర్డ్‌ను పలు మార్లు ఉపయోగించడంతో హ్యాకింగ్ సాధ్యమైనట్లు వెల్లడించింది.
అయితే రష్యన్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ ఇమెయిల్ అకౌంట్స్‌ను చాలా తక్కువ శాతం యాక్సెస్ చేయగలిగింది. ఆ ఈమెయిల్స్‌లో సీనియర్ లీడర్‌షిప్ టీమ్ సభ్యులు, సైబర్ సెక్యూరిటీ, లీగల్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని మైక్రోసాఫ్ట్ నిర్ధారించింది.
మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ బృందం హ్యాకర్స్ దాడులు ఎందుకు చేశారో ఆరా తీసింది. ఇందులో రష్యన్ హ్యాకర్స్ గ్రూప్ మిడ్‌నైట్ బ్లిజార్డ్ గురించి సమాచారం ఉన్న ఈమెయిల్స్ సేకరించే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment