జమ్ము కశ్మీర్ లో అశాంతి సృష్టిస్తూ, కావాలనే అల్లర్లకు కారణమౌతున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కశ్మీర్ లో కుట్రలు పన్నుతున్నవారికి సమాధానం చెప్పితీరుతామని స్పష్టం చేశారు. శాంతి స్థాపన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి సహకరించాల్సిందిగా కోరారు.