ముంబై: రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్‌బీఐ హెచ్చరించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్ హెడ్స్, ఈమెయిల్ అడ్రెస్‌లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్ ట్రాన్స్‌ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.
కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజులు, ట్రాన్స్‌ఫర్/రెమిటెన్స్/ప్రొసీజర్ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్‌బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్ కాల్స్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.
ఆర్‌బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్ లాగిన్ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment