బీజింగ్ల మధ్యనున్న సరిహద్దు సమస్యలో మధ్యలో తలదూర్చవద్దని అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనీస్ బోర్డర్కు పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటించిన అనంతరం, బీజింగ్ ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా చేస్తున్న ఈ కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను మరింత జటిలం చేయడమేనని, విద్రోహ శాంతిని రెచ్చగొట్టడేమనని విమర్శించింది. "ఏ ప్రాంతానైతే మీ సీనియర్ దౌత్య అధికారి సందర్శించారో, ఆ ప్రాంతం చైనా, భారత్లకు మధ్య వివాదాస్పదమైన రీజియన్గా ఉంది. చైనా, భారత్ వివాదాస్పదమైన ప్రాంతంలో అమెరికా రాయబారి సందర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మీడియా ముందు వెల్లడించారు.