సీఫుడ్స్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. వాటితో చేసిన వివిధరకాల రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. అదీగాక రెస్టారెంట్లలలో కూడా ఈ సీఫుడ్ వంటకాల ఖరీదు ఎక్కువే. అయినా కూడా ప్రజలు చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఓమెగా 3 వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇప్పుడున్న పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీఫుడ్ ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. పైగా ఇది తినకపోవడమే మేలంటూ విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అధ్యయనాల్లో ఏం వెల్లడయ్యిందంటే..
యూకేలోని డార్ట్‌మౌత్ కళాశాల నిపుణులు పాదరసం వంటి ఇతర కలుషిత రసాయనాల దృష్ట్యా ప్రజలు సీఫుడ్ వినియోగంపై మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. సముద్రాల్లో చమురు ఓడల క్రాష్ అవ్వడం లేదా మునిగిపోవడం, పారిశ్రామి రసాయనాలు వదలడం వంటి కారణంగా సీఫుడ్ వినియోగం ఎంత వరకు సురక్షితం అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల లభించే విలమిన్లు, పోషకాలను పక్కనే పెడితే ప్రమాదకరమై పర్ పాలి ఫ్లోరో అల్కైల్స్ (పీఎఫ్‌ఏఎస్) వంటి విషపదార్థాల ప్రమాదానికి గురవ్వక తప్పదని హచ్చరిస్తున్నారు.
వీటిని "ఫారెవర్ కెమికల్స్" అని కూడా పిలుస్తారు. అందువల్ల నిపుణులు సీఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిజానికి సీఫుడ్ లీన్ ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌ల మూలం. కానీ కాలుష్యం కారణంగా సముద్ర జీవుల్లో మోతాదుకి మించి విషపదార్థులతో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్ల ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు వంటి వారికి ఈ సీఫుడ్ మరింత హానికరమని చెబుతోంది అధ్యయనం. నిపుణుల పరిశోధనలో సముద్ర జాతుల నమునాలో ఈ పీఎఫ్‌ఏఎస్‌కి సంబంధించిన 26 రకాల విషపూరిత రసాయనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా కాడ్, హాడాక్, సాల్మన్, స్కాలోప్ వంటి చేపలు, పీతలు, రొయ్యల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆయా జీవుల్లో ఒక గ్రాము మాంసంలో దాదాపు 1.74 నుంచి 3.30 నానో గ్రాముల పీఎప్‌ఏఎస్ వంటి రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కాల క్రమేణ పరిస్థితి ఇలా ఉంటే నెమ్మదిగా పర్యావరణ విచ్ఛిన్నమవుతుందని, అదిగాక ఈ పీఎఫ్‌ఏఎస్ పదార్థాలు పర్యావరణంలో వేల సంవత్సరాల అలానే ఉండిపోతాయని అందువల్ల ప్రజలకు, వన్యప్రాణుల మనుగడకు హానికరంగా మారుతుందని చెప్పారు. ఈ పీఎఫ్‌ఏఎస్ రసాయనాలు కారణంగా కేన్సర్, పిండ సంబంధిత సమస్యలు, అధిక కొలస్ట్రాల్, థైరాయిడ్, కాలేయం, పనరుత్పత్తి రుగ్మతలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
(చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!)
Comments
Please login to add a commentAdd a comment