న్యూఢిల్లీ: దేశంలోని ఏటీఎంలలో దాదాపు మూడో వంతు పనిచేయడం లేదని రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. తాజాగా 4,000 వేల ఏటీఎంలపై ఆర్ బీఐ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బట్టబయలయింది. బ్యాంకులపై ఇందుకు సంబంధించి తక్షన చర్యలు తీసుకుంటామని ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముండ్రా తెలిపారు. బ్యాంకుల సర్వీసులు కస్టమర్ కు అనుకూలంగా ఉండేలా చూస్తామని అన్నారు.
ఆన్ లైన్ బ్యాంకింగ్ లో నేరాలకు తావులేకుండా కొత్త నియమాలను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఏ వినియోగదారుడిదైనా క్రెడిట్ కార్డు పోయి అతని అకౌంట్ డబ్బును డూప్లికేట్ కార్డు ద్వారా వినియోగిస్తుంటే ఎలా పట్టుకోవాలనే విషయాలపై చర్చిస్తున్నట్లు వివరించారు. రానురాను డిజిటల్ బ్యాంకింగ్ కు ప్రాధాన్యం పెరుగుతూ పోతుండటంతో కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి బ్యాంకులు గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
థర్డ్ పార్టీలకు చెందిన ఇన్సూరెన్స్ లు తదితరాలను బ్యాంకుల తరఫున ప్రోత్సహిత్సే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మకాలను నివారించేందుకు ప్రత్యేకంగా స్టాఫ్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
దేశంలో మూడోవంతు ఏటీఎంలు గోవిందా!
Published Tue, May 24 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM
Advertisement