అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్‌బీఐ | Open ATMs only after software update: RBI | Sakshi
Sakshi News home page

అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్‌బీఐ

Published Mon, May 15 2017 7:49 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్‌బీఐ

అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్‌బీఐ

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్‌ అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్‌ మీదే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంతో నడిచేవే.

దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్‌ చేసి డబ్బును డిమాండ్‌ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.

ఒకవేళ వాన్నా క్రై ఏటీఎంల నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేస్తే.. వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు జరపలేరిని వివరించారు. అయితే, ఇప్పటికే రెండు దక్షిణాది బ్యాంకుల కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఆర్‌బీఐ దీని మీద ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement