‘మహాదేవ్‌’ కేసు: సెలబ్రిటీలకు కంగనా రనౌత్ హెచ్చరిక! | Kangana Ranaut Warns Bollywood Celebrities Linked To Mahadev Betting App Case, Deets Inside - Sakshi
Sakshi News home page

Mahadev Betting App Case: సెలబ్రిటీలకు కంగనా రనౌత్ హెచ్చరిక!

Published Sat, Oct 7 2023 4:13 PM | Last Updated on Sat, Oct 7 2023 4:33 PM

Kangana Ranaut warns celebs linked to Mahadev betting app case - Sakshi

దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో బాలీవుడ్‌ ప్రముఖ నటులకు భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రణబీర్ కపూర్, హుమా ఖురేషి, హాస్యనటుడు కపిల్ శర్మతో సహా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుతో ముడిపడి ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘా పెట్టింది.

ఇదిలా ఉండగా నటి కంగనా రనౌత్ తనను కూడా మహాదేవ్ యాప్ ప్రమోటర్లు చాలాసార్లు సంప్రదించారని, కానీ తాను తిరస్కరించినట్లు తాజాగా పేర్కొన్నారు. "ఈ ఎండార్స్‌మెంట్ ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు ఆరు సార్లు నాకు వచ్చింది. ప్రతిసారీ అనేక రూ.కోట్లు ఆఫర్‌ చేశారు. కానీ నేను ప్రతిసారీ నో చెప్పాను. ఇది నయా భారత్, దీనికి అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. లేకుంటే బలవంతంగానైనా మెరుగుపడాల్సి వస్తుంది" అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈడీ స్కానర్‌లో ఉన్న ప్రముఖుల గురించిన కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ రాసుకొచ్చారు.

బెట్టింగ్ కేసులో పేరు బయటకు వచ్చిన నటీనటుల్లో కొందరు మహాదేవ్ యాప్‌ను ప్రమోట్ చేయగా, మరికొందరు విదేశాలలో జరిగిన యాప్ ప్రమోటర్ వివాహంలో ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరిలో రస్ అల్-ఖైమాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement