
అశాంతికి కారణమౌతున్న వారిని ఉపేక్షించం: మోదీ
జమ్ము కశ్మీర్ లో అశాంతి సృష్టిస్తూ, కావాలనే అల్లర్లకు కారణమౌతున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో అశాంతి సృష్టిస్తూ, కావాలనే అల్లర్లకు కారణమౌతున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కశ్మీర్ లో కుట్రలు పన్నుతున్నవారికి సమాధానం చెప్పితీరుతామని స్పష్టం చేశారు. శాంతి స్థాపన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి సహకరించాల్సిందిగా కోరారు.
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది సభ్యులతో కశ్మీర్ గురించి ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తాననడం వేర్పాటు వాదులకు మరింత ఊతమిచ్చేదిగా ఉందని అన్నారు. కశ్మీర్లో అశాంతిని సృష్టించేందుకు పాకిస్థాన్ నుంచి రూ.24 కోట్లు చేరాయని చెప్పారు. కాగా కశ్మీర్ లో బుర్హాన్ వనీ మరణానంతరం చెలరేగిన అల్లర్లు 51 వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70 మంది మృతి చెందగా 5000 మంది గాయపడ్డారు.