మాస్కో: ఉగ్రవాదంపై చైనా తన రెండు నాల్కల ధోరణిని మార్చుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగావిమర్శించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ పై ఐక్యరాజ్య సమితిలోనిషేధం విధించే బిల్లును చైనా అడ్డుకోవడంపైఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాస్కో పర్యటనలో ఉన్న సుష్మా రష్యా,చైనా సమ్మిట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.'' ఉగ్రవాదంపై రెండు నాల్కలధోరణితో వ్యవహరిస్తే అది తమ దేశానికే కాకుండా ప్రపంచానికి సైతం హాని చేస్తుంది'' అని పేర్కొన్నారు. అంతకు ముందు చైనా విదేంశాంగమంత్రి వాంగ్ ఈ తో సమావేశమైన ఆమె ఐరాసలో చైనా వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడుగురు భారత సైనికులు మృతి చెందిన పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడి ఘటనలో అజర్ మాస్టర్ మైండ్ గా వ్యవరించాడు. దీనిపై తగిన ఆధారాలను భారత్ ఐరాసకు అందించింది. దీనిని సెక్యూరిటీ కౌన్సిల్ లోని 15 మంది సభ్యులు పరిశీలించారు. అతనిపై చర్యతీసుకునే చివరి నిమిషంలో చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంది. గతంలో ముంబై దాడుల సూత్రదారి జఖి ఉర్ రహ్మాన్ లక్వీపై చర్యలు తీసుకునే విషయంలో కూడా చైనా మోకాలడ్డింది.