న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను చైనా లాబరేటరీలో తయారు చేసిందని.. కావాలనే భూమ్మీదకు వదిలిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన ఓ డాక్యుమెంట్ డ్రాగన్ కుతంత్రాలను మరోసారి వెల్లడించింది. ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్‌లో చైనా మిలిటరీ శాస్త్రవేత్త ఒకరు మూడో ప్రపంచం యుద్ధం గురించి చర్చించారు. సార్స్ వైరస్ జాతి నుంచి తయారు చేసిన జీవాయుధంతో యుద్ధం జరుగుతుందని చైనా ప్రభుత్వ ఆరోగ్య అధికారితో చర్చించినట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దీనిని స్వాధీనం చేసుకుంది
చైనా శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య అధికారులు సార్స్ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్ న్యూస్.కామ్ ప్రకారం, "ది అన్‌నాచుర్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్ బయోవెపన్స్" డాక్యుమెంట్‌లో చైనా మిలటరీ శాస్త్రవత్త తదుపరి ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జరుగుతుందని అంచనా వేశారు. కరోనావైరస్‌లను "జన్యు ఆయుధాల కొత్త శకం"గా, "కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత తరంలో వాడే ఆయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని" ఈ డాక్యుమెంట్‌లో వెల్లడించారు.
చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్-2 వైరస్ తయారైనట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
The mentioned breaking document to “predict World War III as biological war” is the PLA’s novel bioweapon textbook (by General Dezhong Xi, 2015) I’m translating into English with our Chinese volunteers! The brief introduction is in the 3rd Yan Report👇🏻 https://t.co/BxE22sQOuN pic.twitter.com/qkx7cLKclt
— Dr. Li-Meng YAN (@DrLiMengYAN1) May 7, 2021
చదవండి: తండాలో నో కరోనా..!
Comments
Please login to add a commentAdd a comment