88 Years Old World Oldest Wedding Cake Still Intact, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Oldest Cake In The World: యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!

Published Sun, Nov 7 2021 10:45 AM | Last Updated on Sun, Nov 7 2021 12:50 PM

This is Worlds Oldest Wedding Cake Still Intact - Sakshi

World's oldest wedding cake: పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడుతుండటం చూస్తుంటాం.. కానీ, మానవుడు తయారు  చేసిన తినుబండారం చెక్కుచెదరకుండా బయట పడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అది కూడా రెండు రోజుల్లో కుళ్లిపోగల కేకు.. ఇన్నేళ్లుగా ఎలా చెడిపోలేదో ఆశ్యర్యపోతున్నారా! నిజం.. ఇంగ్లండ్‌లోని దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. 

ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా గార్నిషింగ్‌ కోసం వాడిన చాక్లెట్‌ చిప్స్‌ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఓ కత్తి, నాలుగు చెంచాలు కూడా దొరికాయి. ఇదంతా చూస్తుంటే.. ఎవరి పుట్టినరోజో విషాదాంతంగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేకు ఎవరు తయారు చేశారో తెలియదు కానీ, ఆ ఇంటి యజమానిని జోహాన్‌ వార్మ్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఇల్లు కూడా ఆ మంటల్లోనే చిక్కుకొని పూర్తిగా దహనమైపోయిందని అధికారులు తెలిపారు. పైగా ఈ కేకులో ఎటువంటి రసాయనాలను గుర్తించలేదని, ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని వారు చెప్పారు. 

చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్‌ అరెస్ట్‌.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement