wedding cake
-
రూ. 8 కోట్ల వెడ్డింగ్ కేక్..ముత్యాలు, డైమండ్లు.. ఇంకా..!
వెడ్డింగ్ కేక్‌లు ఇపుడు పెళ్లిళ్లలో చాలా కామన్. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. బర్త్‌డే కేక్, ఎంగేజ్మెంట్ కేక్- వెడ్డింగ్ కేక్‌ల నోరూరించే రుచితో సందర్భానికి తగ్గట్టుగా అనేక డిజైన్లలో కేక్‌లు తయారు చేయడం ఆనవాయితీ. అలాగే దాని డిజైన్, వెయిట్, ఫ్లేవర్ఆధారంగా ధర ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్ చూశారా. దీనికి ఖరీదు 8 కోట్ల రూపాయలకంటే ఎక్కువే. అరబ్ వధువు ఆకారంలో ఉన్న కేక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. లైఫ్ సైజ్ అరబ్ బ్రైడల్ కేక్ దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్, బృందం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌ను తయారు చేశారు. దుబాయ్ వధువు ఆకారంలో దీన్ని రూపొందించడం ఒక ఎత్తయితే ఎడిబుల్ ముత్యాలు, డైమండ్స్‌తో తయారు చేయడం మరో ఎత్తు. అరబ్ బ్రైడల్ కేక్ 182 సెం.మీ ఎత్తు, 120 కిలోల బరువు కలిగి ఉంది. కేక్ తయారీకి పది రోజుల సమయం పట్టింది. దుబాయ్‌లోని రాఫెల్స్ హోటల్లో 1,000 గుడ్లు , 20 కిలోల చాక్లెట్‌తో కేక్‌ను తయారు చేశారు. కేక్‌లో 50 కిలోల లాసీ మిఠాయి వివరాలు, తినదగిన 3-క్యారెట్ వజ్రాలు ,ముత్యాలు కూడా ఉన్నాయి. కేక్‌లో పొదిగిన ప్రతి వజ్రం మిలియన్ల కంటే ఎక్కువ విలువైనదట అందుకే ఈ కేక్ ధర అంత పలికింది. రైస్ క్రిస్పీ ,మోడలింగ్ చాక్లెట్‌తో దీన్ని రూపొందించారు.దీనికి అదనంగా20 కిలోల బెల్జియన్ చాక్లెట్లను కూడా ఉపయోగించారు. 50 కిలోల కేక్ ఫాండెంట్, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్ పువ్వులతోఘీ వెడ్డింగ్ గౌన్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. View this post on Instagram A post shared by Couture Sugarpaste (@couturesugarpaste) -
వరుడు షాక్.. ఇది వధువు చేసిన పనే!?
వివాహ వేడుకల్లో కొన్ని పనులు సంతోషాన్ని రెట్టింపు చేస్తే మరికొన్ని సంఘటనలు మాత్రం కోపాన్ని.. చికాకును తెప్పిస్తుంటాయి. అయితే వధూవరులను ఒక్కసారిగా చికాకు తెప్పిన ఘటన ఇటీవల ఓ వివాహ వేడుకలో జరిగింది. అయితే వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఇర్వాత గ్రాండ్‌గా పెళ్లి కేక్ కట్ చేసే సందర్భం. ఇంతలో వేదిక వద్దకు హోటల్ సిబ్బంది వివాహ కేక్‌ను తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ అది కిందపడిపోయింది. కేక్ కోసం చూస్తున్న వధూవరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హోటల్ సిబ్బంది.. కొద్ది నిమిషాల తర్వాత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అయితే సిబ్బంది చేతుల నుంచి పడిపోయింది నిజమైన వివాహ కేక్ కాదు! అసలు వెడ్డింగ్ కేక్‌ను నిమిషాల్లో వారి ముందుకు తీసుకువచ్చారు. నూతన వధూవరులు ఆశ్చర్యపోయారు. అయితే వధూవరులను హోటల్ సిబ్బంది చిలిపిగా ప్రాంక్ చేశారు. అయితే ఈ కేక్ కిందపడిపోతున్న సమయంలో వధూవరులిద్దరూ.. అయ్యో! కేక్ కిందపడిపోయిందే అన్నట్లు ఫీలయ్యారు. ప్రపోజల్, వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ‘దేవునికి ధన్యవాదాలు ఇది ఒక చిలిపి పని!! దాదాపు మాకు కన్నీళ్లు వచ్చాయి’ అని కామెంట్ కూడా జత చేశారు. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అనంతరం వధూవరులు సంతోషంతో కేక్ కట్ డ్యాన్స్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మొత్త కేక్ వృథా చేశారు?!’.. ‘వరుడు షాక్ అయ్యాడు. ఇది వధువు చేసిన పనే!?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Proposal~Wedding~Engagement (@she_saidyes) -
88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!
World's oldest wedding cake: పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడుతుండటం చూస్తుంటాం.. కానీ, మానవుడు తయారు చేసిన తినుబండారం చెక్కుచెదరకుండా బయట పడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అది కూడా రెండు రోజుల్లో కుళ్లిపోగల కేకు.. ఇన్నేళ్లుగా ఎలా చెడిపోలేదో ఆశ్యర్యపోతున్నారా! నిజం.. ఇంగ్లండ్‌లోని దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా గార్నిషింగ్ కోసం వాడిన చాక్లెట్ చిప్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఓ కత్తి, నాలుగు చెంచాలు కూడా దొరికాయి. ఇదంతా చూస్తుంటే.. ఎవరి పుట్టినరోజో విషాదాంతంగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేకు ఎవరు తయారు చేశారో తెలియదు కానీ, ఆ ఇంటి యజమానిని జోహాన్ వార్మ్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఇల్లు కూడా ఆ మంటల్లోనే చిక్కుకొని పూర్తిగా దహనమైపోయిందని అధికారులు తెలిపారు. పైగా ఈ కేకులో ఎటువంటి రసాయనాలను గుర్తించలేదని, ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని వారు చెప్పారు. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
వేలానికి 40 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఏకంగా
లండన్: పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. అటు తినలేం ఇటు పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలు.. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓదాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది. ఆమె దీన్ని ఓ పూల కేక్ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్ చార్లెస్-ప్రిన్సెస్ డయానాల వివాహ కేక్’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్ వేసి ఉంది. స్మిత్ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్ వింటర్ ఔక్షనీర్స్ సీనియర్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. -
వారి పెళ్లి కేకుకే కోటిన్నర
ఇంగ్లండ్: ఎవరైనా అట్టహాసంగా, ఆర్భాటంగా వివాహం చేసుకుంటే ఆకాశమంతా పందిరివేసి, భూగోళమంతా పీట వేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారని చెప్పడం గతం. ఇప్పుడు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పడమే ఆ పెళ్లి ఆర్భాటానికి కొలమానం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నల్లజాతి మహిళగా గుర్తింపు పొందిన ఫోలోరన్షో అలకిజా (66) తన కుమారుడు ఫోలారిన్ అలకిజా వివాహాన్ని ఆదివారం అత్యంత ఆర్భాటంగా చేశారు. ఒక్క పెళ్లి రోజునాటి ఖర్చే 50 కోట్ల రూపాయలకు పైమాటట. ఆక్స్ఫర్డ్షైర్లోని బ్లెన్హైమ్ ప్యాలెస్‌లో ఇరాన్‌కు చెందిన మోడలింగ్ బ్యూటీ నజానిన్ జఫారియాన్తో పెళ్లి జరిగింది. మాన్చెస్టర్ యూనివర్శిటీలో బయో ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన జఫారియాన్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌గా, మోడల్‌గా ఇప్పుడు రానిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్, వ్యాపారవేత్తగా బాగా సంపాదిస్తున్న పెళ్లి కూమారుడు ఫోలారిన్కు 30 ఏళ్లు. ఆయనకు ఇది రెండో వివాహం. మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆయన ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగిన ప్యాలెస్‌కు రూములు కలుపుకొని రోజుకు మూడు కోట్ల రూపాయల అద్దె. పెళ్లి మంటపం అలంకరనకు కోటి తెల్ల గులాబీ పూలను ఉపయోగించారు. పెళ్లి కేకును అలంకరించేందుకే పది లక్షల తెల్ల గులాబీ పూలను ఉపయోగించారట. అలంకరణతో కలిపి ఒక్క కేకుకే కోటిన్నర రూపాయలట. ఇరువర్గాల బంధు, మిత్రులు హాజరైన ఈ వివాహానంలో రాబిన్ థికే లాంటి గాయకులు తమ కచేరీలతో ఆకట్టుకున్నారు. రాబిన్ థికే ఒక కచేరీకి కోటిన్నర రూపాయలు చార్జి చేస్తారు. రెండు బిలియన్ డాలర్ల ఆస్తితో ఆఫ్రికాలో 14వ ధనవంతురాలిగా, బ్రిటన్‌లో నెంబర్ వన్ ధనవంతురాలిగా గుర్తింపుపొందిన ఫోలోరన్షో అలకిజా తన కుమారుడి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువేనని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. చమురు వ్యాపారం ద్వారా ఆమె ఈ ఆస్తిని సంపాదించారు. -
కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!
విక్టోరియా మహారాణి పెళ్లినాటి కేకు ముక్కను వేలం వేస్తే.. ఏకంగా రూ. 1.33 లక్షలు పలికింది. అది 19వ శతాబ్దం నాటి కేకు ముక్క కావడం, అది కూడా రాణీగారి పెళ్లి కేకు కావడంతో ఈ స్థాయిలో ధర వచ్చింది. యువరాజు ఆల్బర్ట్‌తో విక్టోరియా మహారాణి పెళ్లి 1840లో జరిగింది. దీన్ని డేవిడ్ గైన్స్బరో రాబర్ట్స్ వేలానికి పెట్టారు. దాన్ని ప్యాక్ చేసిన ప్రజంటేషన్ బాక్సుమీద ''రాణీగారి పెళ్లి కేకు బకింగ్‌హామ్ ప్యాలెస్, ఫిబ్రవరి 10, 1840'' అని చెక్కి ఉంది. రాజముద్ర ఉన్న కాగితం మీద విక్టోరియా మహారాణి సంతకం కూడా ఆ కేకుతో పాటు ఉంచారు. లండన్‌లోని క్రిస్టీస్ వేలం శాలలో మోనార్క్ నిక్కర్లు, టైటానిక్ తాళాలు, విన్స్టన్ చర్చిల్ టోపీ కూడా వేలానికి వేశారని బీబీసీ తెలిపింది. అండర్‌వేర్‌కు రూ. 14.42 లక్షల రేటు పలికింది. నిజానికి దీనికి మహా అయితే 88 వేల నుంచి 1.6 లక్షల వరకు మాత్రమే వస్తుందని అంచనా వేశారు. జీవితాంతం అరుదైన వస్తువులను సేకరిస్తూ వచ్చిన రాబర్ట్స్ (70).. ఇప్పుడు వాటిని వేలం వేసి లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. -
గే జంటకు కేక్ నిరాకరణ:రూ. 85లక్షల జరిమానా
లాస్ ఏంజిల్స్:గత రెండు సంవత్సరాల క్రితం ఓ స్వలింగ సంపర్క జంటకు పెళ్లి కేక్ ఇవ్వడానికి నిరాకరించినందుకు బేకరీ యజమానికి లక్షా ముప్పైదు వేల డాలర్లు(రూ. 85 లక్షలు) జరిమానా విధిస్తూ తాజాగా ఆరిగాన్ లేబర్ కమిషన్ తీర్పునిచ్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 2013 లో పెళ్లి కేక్ తీసుకుందామని గ్రీషమ్ లోని మెలీస్సా బేకరీకి రిచెల్ మరియు లారెల్ బోమన్ అనే స్వలింగ సంపర్క జంట వచ్చారు. అయితే వారికి అక్కడ నిరాశే ఎదురైంది. పెళ్లి కేక్ ను ఇవ్వడానికి యజమాని నిరాకరించాడు. స్వలింగ సంపర్క వివాహాలకు తమ మత సంప్రదాయాలు ఒప్పుకోవని బేకరీ యజమాని క్లెయిన్స్ అందుకు విముఖత వ్యక్తం చేశాడు. దీనిపై ఆ జంట లేబర్ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ అంశంపై గురువారం లేబర్ కమిషనర్ బ్రాడ్ తుది తీర్పును వెలువరించారు. ఆ జంట అడిగిన పెళ్లి కేక్ ను నిరాకరించింనందుకు లక్షా ముప్ఫై ఐదు వేల డాలర్లు వారికి పరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆ యజమాని ప్రస్తుతం బేకరీని మూసివేయడం గమనార్హం. గత సంవత్సరం నవంబర్ లో స్వలింగ వివాహాలకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.దేశంలో నివసించే స్వలింగ సంపర్క పౌరులకు ఇది చట్టపరంగా లభించిన హక్కుగా ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది.