వెడ్డింగ్ కేక్‌లు ఇపుడు పెళ్లిళ్లలో చాలా కామన్. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. బర్త్‌డే కేక్, ఎంగేజ్‌మెంట్ కేక్- వెడ్డింగ్ కేక్‌ల నోరూరించే రుచితో సందర్భానికి తగ్గట్టుగా అనేక డిజైన్లలో కేక్‌లు తయారు చేయడం ఆనవాయితీ. అలాగే దాని డిజైన్, వెయిట్, ఫ్లేవర్‌ఆధారంగా ధర ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్ చూశారా. దీనికి ఖరీదు 8 కోట్ల రూపాయలకంటే ఎక్కువే. అరబ్ వధువు ఆకారంలో ఉన్న కేక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది.
లైఫ్ సైజ్ అరబ్ బ్రైడల్ కేక్
దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్, బృందం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌ను తయారు చేశారు. దుబాయ్ వధువు ఆకారంలో దీన్ని రూపొందించడం ఒక ఎత్తయితే ఎడిబుల్ ముత్యాలు, డైమండ్స్‌తో తయారు చేయడం మరో ఎత్తు. అరబ్ బ్రైడల్ కేక్ 182 సెం.మీ ఎత్తు, 120 కిలోల బరువు కలిగి ఉంది.
కేక్ తయారీకి పది రోజుల సమయం పట్టింది. దుబాయ్‌లోని రాఫెల్స్ హోటల్‌లో 1,000 గుడ్లు , 20 కిలోల చాక్లెట్‌తో కేక్‌ను తయారు చేశారు. కేక్‌లో 50 కిలోల లాసీ మిఠాయి వివరాలు, తినదగిన 3-క్యారెట్ వజ్రాలు ,ముత్యాలు కూడా ఉన్నాయి. కేక్‌లో పొదిగిన ప్రతి వజ్రం మిలియన్ల కంటే ఎక్కువ విలువైనదట అందుకే ఈ కేక్ ధర అంత పలికింది. రైస్ క్రిస్పీ ,మోడలింగ్ చాక్లెట్‌తో దీన్ని రూపొందించారు.దీనికి అదనంగా20 కిలోల బెల్జియన్ చాక్లెట్లను కూడా ఉపయోగించారు. 50 కిలోల కేక్ ఫాండెంట్, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్ పువ్వులతోఘీ వెడ్డింగ్ గౌన్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment