Shocking: Wedding Cake Dropped By Hotel Staff, See Bride And Groom Reaction - Sakshi
Sakshi News home page

Viral Video: వరుడు షాక్‌.. ఇది వధువు చేసిన పనే!?

Published Tue, Dec 7 2021 1:38 PM | Last Updated on Tue, Dec 7 2021 4:23 PM

Bride And Groom Shocked Hotel Staff Drop Marriage Cake Big Twist Viral - Sakshi

వివాహ వేడుకల్లో కొన్ని పనులు సంతోషాన్ని రెట్టింపు చేస్తే మరికొన్ని సంఘటనలు మాత్రం కోపాన్ని.. చికాకును తెప్పిస్తుంటాయి. అయితే వధూవరులను ఒక్కసారిగా చికాకు తెప్పిన ఘటన ఇటీవల ఓ వివాహ వేడుకలో జరిగింది. అయితే వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఇర్వాత గ్రాండ్‌గా పెళ్లి కేక్ కట్ చేసే సందర్భం. ఇంతలో వేదిక వద్దకు హోటల్ సిబ్బంది వివాహ కేక్‌ను తీసుకువస్తుండగా ప్రమాదవశాత్తూ అది కిందపడిపోయింది.

కేక్ కోసం చూస్తున్న వధూవరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హోటల్‌ సిబ్బంది.. కొద్ది నిమిషాల తర్వాత పెద్ద ట్విస్ట్‌ ఇచ్చారు. అయితే సిబ్బంది చేతుల నుంచి పడిపోయింది నిజమైన వివాహ కేక్ కాదు! అసలు వెడ్డింగ్ కేక్‌ను నిమిషాల్లో వారి ముందుకు తీసుకువచ్చారు. నూతన వధూవరులు ఆశ్చర్యపోయారు. అయితే వధూవరులను హోటల్ సిబ్బంది చిలిపిగా ప్రాంక్‌ చేశారు. అయితే ఈ కేక్ కిందపడిపోతున్న సమయంలో వధూవరులిద్దరూ.. అయ్యో! కేక్‌ కిందపడిపోయిందే అన్నట్లు ఫీలయ్యారు.

ప్రపోజల్, వెడ్డింగ్, ఎంగేజ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేసింది. ‘దేవునికి ధన్యవాదాలు ఇది ఒక చిలిపి పని!! దాదాపు మాకు కన్నీళ్లు వచ్చాయి’ అని కామెంట్‌ కూడా జత చేశారు. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అనంతరం వధూవరులు సంతోషంతో కేక్‌ కట్‌ డ్యాన్స్‌ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మొత్త కేక్‌ వృథా చేశారు?!’.. ‘వరుడు షాక్‌ అయ్యాడు. ఇది వధువు చేసిన పనే!?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement