
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యాపై తాము పోరాటం చేయబోమని అన్నారు. నాటో, రష్యా ముఖాముఖి తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని శుక్రవారం హెచ్చరించారు. దాన్ని నివారించేందుకు కృషి చేస్తామన్నారు. సభ్యదేశాల భూభాగంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకునే శక్తిసామర్థ్యాలు నాటోకు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విజయం అసాధ్యమన్నారు. నాటో కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న పుతిన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రపంచం దశ, దిశను కొందరు నియంతలు నిర్ణయిస్తామంటే అనుమతించబోమన్నారు.