![USA president announces Rs.2,695 crore aid to Ukraine - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/23/usa.jpg.webp?itok=UzCAU4DZ)
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్‌కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్‌కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు.
రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్‌కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్‌కు ఇస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment